Ravi Teja: ఆస్పత్రి నుంచి రవితేజ డిశ్చార్జ్‌..హెల్త్ అప్డేట్ ఇస్తూ మాస్ మ‌హారాజా పోస్ట్

మాస్ మహారాజా రవితేజ తనకు జరిగిన సర్జరీపై తాజాగా హెల్త్ అప్డేట్ ఇచ్చారు. "శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది.క్షేమంగా ఇంటికి డిశ్చార్జ్ అయ్యాను. మీ అందరి ఆశీర్వాదాలు..మీ మద్దతుకు కృతజ్ఞతలు. త్వరలోనే సెట్‌లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని ట్విట్టర్X లో పోస్ట్ చేశారు.

ఈ విషయం తెలిసిన మాస్ రాజా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. RT 75 షూటింగ్‎లో గాయపడిన విషయం తెలియగానే రవితేజ అభిమానులు ఆందోళన చెందారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తమ అభిమాన హీరోకి ఏమైందంటూ చర్చించుకున్నారు. 

 రవితేజ గాయం:

రచయిత భాను భోగవరపు తెరకెక్కిస్తున్న RT75 షూటింగ్ లో పాల్గొన్న రవితేజకు ప్రమాదవశాత్తు కుడిచేతికి గాయమైంది. అయితే ఆ గాయంతోనే షూటింగ్ లో పాల్గొన్నారు రవితేజ. ఆ గాయాన్ని లెక్క చేయకుండా అవిశ్రాంతంగా చిత్రీకరణలో పాల్గొనడంతో అది తీవ్రమైంది. దీంతో హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే కుడిచేతికి ఆపరేషన్ చేశారు. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకి వైద్యులు సూచించారు.