ప్రముఖ సినీ హీరో రవితేజ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు.. ఆర్టీ75 సినిమా షూటింగ్ లో పాల్గొన్న రవితేజకు ప్రమాదవశాత్తు కుడిచేతికి గాయమైంది. అయితే గాయంతోనే షూటింగ్ లో పాల్గొన్నారు రవితేజ..
కుడిచేతికి గాయం ఎక్కువ కావడంతో హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. రవితేజ కుడిచేతికి ఆపరేషన్ చేశారు. వైద్యులు.. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ప్రస్తుతం హీరో రవితేజ.. భాను భోగవరపు అనే కొత్త దర్శకుడి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతున్నది. యాక్షన్ పార్ట్ షూట్ చేస్తున్న సమయంలో.. బ్యాలెన్స్ తప్పి కింద పడినట్లు తెలుస్తోంది. దీంతో కుడి చేతి కండరం చిట్టినట్లు సమాచారం. నొప్పి భరించి మరీ.. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి ఆస్పత్రికి వెళ్లినట్లు షూటింగ్ వర్గాలు చెబుతున్నాయి.
గాయం తీవ్రత కొంచెం ఎక్కువగానే ఉండటంతో.. ఆగస్ట్ 22వ తేదీ గురువారం సర్జరీ జరిగినట్లు చెబుతున్నారు యూనిట్ వర్గాలు. డాక్టర్ల సూచనలతో ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని రవితేజ నిర్ణయించినట్లు తెలుస్తుంది.
భాను భోగవరపు దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. రవితేజకు 75వ సినిమా. ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్నారు.