
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ కి వచ్చి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు మాస్ మహారాజ రవితేజ. అయితే రవితేజ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్ గా కేరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్నాళ్లపాటు చిన్నాచితకా పాత్రల్లో నటించాడు. అలా క్రమక్రమంగా ఎదుగుతూ ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎదిగి నేటితరం నటీనటులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
అయితే రవితేజ కూతురు మోక్షద భూపతి రాజు, కొడుకు మహాధన్ భూపతి రాజు కూడా ఇండస్ట్రీలో రాణించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే మోక్షద కి అందం అభినయం మెండుగా ఉన్నప్పటికీ హీరోయిన్ గా నటించడం ఇష్టం లేకపోవడంతో ప్రొడ్యూసర్ గా మారనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఇప్పటికే మోక్షద టాలీవుడ్ లోని ఓ బడా నిర్మాణ సంస్థలో చేరి ప్రొడక్షన్ విభాగంలో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం.
తాజాగా మోక్షద ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో హాట్ టాపిక్ గా మారింది. ఇక రవితేజ కొడుకు మహాధన్ కూడా దర్శకత్వ విభాగంలో ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. దీంతో స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరినట్లు వార్తలు వినిపించాయి. మరి రవితేజ ఫ్యామిలీలోని ఈ ఇద్దరి నుంచి ఎవరు ముందుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హీరో రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజకి జోడీగా యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. భాను బోగవరపు దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే "మాస్ జాతర" షూటింగ్ పూర్తి కాగా మే 9న రిలీజ్ కానుంది.