Jr NTR: కేశవనాథేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న ఎన్టీఆర్..వీడియో పోస్ట్ చేసిన రిషబ్ శెట్టి

జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) గత మూడు రోజులుగా కుటుంబ సమేతంగా కర్ణాటకలోని ప్రముఖ పురాతన దేవాలయాల్ని దర్శించుకుంటున్నారు. తాజాగా కాంతార హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టి (Rishabshetty) ఇల్లు ఉన్న కెరడి మూడగల్లు గ్రామ సమీపంలోని కేశవనాథేశ్వర గుహ ఆలయాన్ని(Sri Keshavanatheshwara Temple) ఎన్టీఆర్ సందర్శించారు.

హీరో రిషబ్ శెట్టి భార్య ప్రగతి శెట్టి, ప్రశాంత్ నీల్ ఆయన భార్య లిఖిత, ఎన్టీఆర్, సతీమణి లక్ష్మి ప్రణతితో కలిసి కేశవనాథేశ్వర గుహలో కొలువై ఉన్న పరమేశ్వరుడి దర్శనం చేసుకున్నారు.

ఈ సమయంలో అక్కడి సహజ సౌందర్యానికి ఎన్టీఆర్ ఆకర్షితుడయ్యాడు. అటవీ ప్రాంతంలోని పురాతన గుహలో స్వయంభువుగా కొలువైన ఆ పరమేశ్వరుడిని ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ దర్శించుకున్న వీడియోని తాజాగా హీరో రిషబ్ శెట్టి ట్విట్టర్ X ద్వారా షేర్ చేశారు.

ఇందుకు సంబంధించి “నవ్వు, జ్ఞాపకాలు, ఆశీర్వాదాలు మరియు నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రియమైన సోదరుడు JrNTR తో పాటు మూడగల్లు కేశవనాథేశ్వర ఆలయా దర్శనం ఒక శుభప్రదమైన ప్రయాణం” అని ఓ వీడియోను X వేదికక షేర్ చేసాడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో..తెలుగు, కన్నడ సినీ ఫ్యాన్స్ ను వీపరీతంగా ఆకట్టుకుంటోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్‌ ను తల్లి షాలిని, భార్య ప్రణతి తో కలిసి ఎన్టీఆర్ దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఎన్టీఆర్ ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా చేసాడు.

"నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్న మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది, సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు జరిగేలా చేయడం నేను ఆమెకు నేను ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి" అని ‘X’ ఖాతాలో పోస్ట్ చేసాడు తారక్.