
తెలుగు హీరో సాయి దుర్గతేజ్ శ్రీశైల మల్లికార్జున స్వామిని మంగళవారం(ఫిబ్రవరి 17) దర్శించుకున్నారు. సాయి దుర్గతేజ్ దర్శనానికి వచ్చిన సందర్భంగా అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ చరిత్రను చెప్పి ప్రత్యేక దర్శనం కల్పించారు.
మల్లన్న దర్శనం అనంతరం భ్రమరాంభ దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు హీరో సాయి దుర్గ తేజ. ఆ తర్వాత పాతాళగంగ అందాలను చూసీ ఆనందించారు. శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
శ్రీశైలం వచ్చిన సాయి దుర్గ తేజకు కర్నూలు జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
ALSO READ | ఏపీపై జీబీఎస్ వ్యాధి అటాక్.. గుంటూరులో మహిళ మృతి.. ఆ 16 మంది పరిస్థితి ఏంటో..?