రెడీ ఫర్ షూట్ అంటున్న సుప్రీం హీరో

హైదరాబాద్: సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో యాక్సిడెంట్‌‌‌‌కి గురై గాయాలపాలైన సాయితేజ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. తన ఫొటోస్‌‌‌‌ని కూడా సోషల్‌‌‌‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. దాంతో తిరిగి షూట్స్‌‌‌‌లో ఎప్పుడు పాల్గొంటాడు, ఏ సినిమా చేయబోతున్నాడనే విషయాలపై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నెలాఖరులో తేజ్ మళ్లీ వర్క్‌‌‌‌ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సముద్రఖని నటిస్తూ, డైరెక్ట్ చేసిన తమిళ చిత్రం ‘వినోదాయ సిత్తం’ తెలుగు రీమేక్‌‌‌‌లో పవన్‌‌‌‌ కళ్యాణ్‌‌‌‌తో కలిసి సాయితేజ్ నటించనున్నాడనే వార్త కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. ఈ నెల చివరి వారంలోనే ఈ మూవీ షూటింగ్‌‌‌‌ మొదలు పెట్టబోతు న్నారట. తమిళంలో తంబి రామయ్య చేసిన లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌ను తేజ్‌‌‌‌కి తగ్గట్టు చేంజ్ చేస్తున్నారు త్రివిక్రమ్. తెలుగులోనూ సముద్రఖనియే డైరెక్ట్ చేయనున్నారు. యాక్సిడెంట్‌‌‌‌లో చనిపోయిన ఓ వ్యక్తి, తన కుటుంబ బాధ్యతలు నెరవేర్చు కోవడం కోసం దేవుడి దగ్గర మూడు నెలలు పర్మిషన్ తీసుకుని తిరిగి ఈ లోకానికి రావడమే మూవీ కాన్సెప్ట్. దేవుడి పాత్రలో నటించనున్న పవన్, ఈ సినిమా కోసం ఇరవై రోజులు కేటాయిస్తున్నట్లు సమాచారం.