
ముంబై: సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. గురువారం అర్ధరాత్రి ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సల్మాన్‌ను ముడిపెడుతూ వచ్చిన పాటపై ఈ బెదిరింపులు వచ్చాయి. ఆ సాంగ్ రైటర్ ఒక నెలలోపు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘‘సాంగ్ రైటర్ నెలలోపు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాటల రచయిత ఇకపై పాటలు రాయలేడు. సల్మాన్ ఖాన్‌కు ధైర్యం ఉంటే వారిని రక్షించుకోవాలి’ అని హెచ్చరించారు. ఈ బెదిరింపులపై పోలీసులు కేసు నమోదు చేశారు.