11 ఏళ్లు పూర్తి చేసుకున్న‘హృదయ కాలేయం’.. సీరియస్ రోల్స్ చేయాలనుంది: సంపూర్ణేష్​ బాబు

11 ఏళ్లు పూర్తి చేసుకున్న‘హృదయ కాలేయం’.. సీరియస్ రోల్స్ చేయాలనుంది: సంపూర్ణేష్​ బాబు

‘హృదయ కాలేయం’సినిమాతో బర్నింగ్ స్టార్‌‌‌‌గా పరిచయమైన సంపూర్ణేష్​ బాబు నటుడిగా మంచి గుర్తింపును అందుకున్నాడు. దర్శకుడు సాయి రాజేష్ రూపొందించిన ఈ సినిమా విడుదలై 11 ఏళ్లు పూర్తయ్యింది.

ఈ సందర్భంగా సంపూర్ణేష్​ బాబు మాట్లాడుతూ ‘నరసింహా చారిగా చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన నన్ను ‘హృదయకాలేయం’సినిమాతో సంపూర్ణేష్ బాబుగా మార్చిన సాయి రాజేష్ అన్నకు రుణపడి ఉంటాను. ఈ సినిమా రిలీజ్ టైమ్‌‌లో దర్శకులు రాజమౌళి గారు చేసిన ట్వీట్ వల్ల నాకు ఎంతో గుర్తింపు దక్కింది.

అలాగే ఆ టైమ్‌‌లో చాలామంది నాకు సపోర్ట్‌‌ చేశారు. ఈ 11 ఏళ్లలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించాను. ఈనెల 25న ‘సోదరా’మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా. మరో రెండు సినిమాలు రిలీజ్‌‌కు రెడీ అవుతున్నాయి. కామెడీతో పాటు సీరియస్ క్యారెక్టర్స్ కూడా చేయాలని అనుకుంటున్నా’అని సంపూర్ణేష్​ బాబు చెప్పాడు.