టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చకున్నారు. కెరీర్ ప్రారంభంలో వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేసిన సందీప్ ఆ తరువాత మాత్రం ఆ సక్సెస్ ను కొనసాగించలేకపోయారు. అప్పటి నుండి సక్సెస్ కోసం సినిమా చేస్తూనే ఉన్నాడు కానీ, ఒక్కటికూడా వర్కౌట్ అవడం లేదు. ఇక ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైవరకోన(Ooru Peru Bhairavakona). డివోషనల్ అండ్ మిస్టీరియస్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు విఐ ఆనంద్(VI Anand) తెరకెక్కించగా యంగ్ బ్యూటీ వర్ష బొల్లమ(Varsha Bollama) హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ ప్రేమికుల రోజు సందర్బంగా తన ప్రేమకథల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రేమ కథలు అని ఎండాకన్నామంటే మనోడికి ఒకటి కాదు ఏకంగా మూడు ప్రేమకథలు ఉన్నాయట. కానీ, ఒకటి కేసుల వర్కౌట్ అవలేదట.
ALSO READ :- ట్రాఫిక్ రూల్స్ పాటించాలి : సునీత కుంచాల
ఇదే విషయం గురించి సందీప్ మాట్లాడుతూ.. నా లైఫ్ లో మూడు ప్రేమకథలు ఉన్నాయి. అవి కూడా ఇండస్ట్రీకి సంబందించిన వారే. కానీ, బయటకు తెలియకుండా చాలా కేర్ తీసుకున్నా. వాటిలో ఒకటి కూడా పెళ్లి వరకు రాలేదు. నిజానికి పెళ్లి చేసుకుంటే జీవితాంతం కలిసి ఉండాలి. ఈ మధ్య చాలా పెళ్లిళ్లు నిలబడటం లేదు. అందుకే ప్రస్తుతానికి పెళ్లి గురించి ఆలోచించడంలేదు.. అంటూ చెప్పుకొచ్చారు సందీప్. ప్రస్తుతం సందీప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ సందీప్ ప్రేమించిన ఆ ముగ్గురు ఇండస్ట్రీ బ్యూటీలు ఎవరా అని ఆరా తీస్తున్నారు.