Satya dev's Krishnamma: ఒక్క ట్రైలర్తో అంతా మారిపోయింది.. కృష్ణమ్మపై అంచనాలు పెరుగుతున్నాయి

Satya dev's Krishnamma: ఒక్క ట్రైలర్తో అంతా మారిపోయింది.. కృష్ణమ్మపై అంచనాలు పెరుగుతున్నాయి

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్య దేవ్(Satya dev) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కృష్ణమ్మ(Krishnamma). కొత్త దర్శకుడు వీవీ గోపాలకృష్ణ(VV Gopala krishn) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను  స్టార్ డైరెక్టర్ కొరటాల సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ రూరల్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో అతీరా రాజ్‌  హీరోయిన్‌గా నటిస్తుండగా...మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఇందులో భాగంగానే కృష్ణమ్మ ట్రైలర్ విడుదల చేశారు. 

నిజానికి ఈ సినిమా చాలా కాలం క్రితమే అనౌన్స్మెంట్ వచ్చింది కానీ, ప్రేక్షకుల్లో మాత్రం అంతగా బజ్ క్రియేట్ అవలేదు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు సమర్పకుడిగా ఉన్నప్పటికీ అంతగా ప్రేక్షకుల్లోకి వెళ్ళలేదు. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనుకున్నారు చాలా మంది. కానీ, అనూహ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ కృష్ణమ్మ సినిమాపై అంచనాలు పెంచుతోంది. 

ట్రైలర్ ను నెక్స్ట్ లెవల్లో కట్ చేశారు మేకర్స్. రా అండ్ రస్టిక్ బ్యాక్డ్రాప్, ముగ్గురు అనాధ స్నేహితులు, ప్రేమ, రివెంజ్ ఇలా చాలా ఎమోషనల్ పాయింట్స్ ను చూపించారు ట్రైలర్ లో. కానీ, ఆ ఎమోషన్స్ వెనుకనున్న కథను మాత్రం రివీల్ కానివ్వలేదు. ముగ్గుఋ అనాధలు అన్యాయంగా అరెస్ట్ అవడం, వారిని పోలీసులు చిత్రహింసలు పెట్టడం వంటి సీన్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక.. కథ నడకకైనా.. నది నడకకైనా మలుపులే అందం.. కానీ కొన్ని మలుపుల్లో సుడులు కూడా ఉంటాయ్.. అంటూ సత్యదేవ్ చెప్పిన డైలాగ్స్ ట్రైలర్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెల్లింది. మొత్తానికి ఈ ట్రైలర్ కృష్ణమ్మ సినిమాపై అంచనాలను, మంచి బజ్ ను క్రియేట్ చేసింది. మరి మంచి ఎమోషనల్ పాయింట్ తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.