Vijay, Satyadev: తెరపై విజయ్, సత్యదేవ్ కాంబో.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్

Vijay, Satyadev: తెరపై విజయ్, సత్యదేవ్ కాంబో.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకేసారి మూడు పాన్ ఇండియా సినిమాలను ఒకే చేసి కెరీర్ లో ఎన్నడూ లేనంత జోష్ లో ఉన్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ నుండి మొన్న వచ్చిన ఫ్యామిలీ స్టార్ వరకు అన్నీ సినిమాళుళ్ ప్లాప్ గా నిలిచాయి. అందుకే.. ఒకే ఒక్క హిట్టు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు విజయ్. ఇందులో భాగంగానే ప్రస్తుతం దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు విజయ్. 

పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు విజయ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుండి ఓక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ కీ రోల్ చేస్తున్నాడట. అవును.. చాలా కీలక సమయంలో వచ్చే ఆ పాత్ర సినిమాకు చాలా ప్రత్యేకం కాగా ఆ పాత్ర కోసం సత్యదేవ్ ను సంప్రదించారట మేకర్స్. 

పాత్ర నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట సత్యదేవ్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇక వీడీ 12 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది మొదట్లో గానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో విజయ్ హిట్టు కొడతాడా చూడాలి.