రామ్ చరణ్ డైరెక్టర్తో శర్వా మూవీ..క్లాస్ హీరో మాస్ అయ్యేనా.?

టాలీవుడ్‌లో టాలెంటెడ్ యాక్టర్స్ లలో శర్వానంద్(Sharwanand) ఒకరు. చాలా కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న ఈ క్లాస్ హీరో సైలెంట్గా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం మాస్ డైరక్టర్ సంపత్ నంది కథకు శర్వా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న శర్వా కోసం..సంపత్ నంది పవర్ఫుల్ స్టోరీ రెడీ చేసాడని..ఇందుకోసం వీరిద్దరూ భారీ ప్లాన్ తో హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారట. ఈ సినిమాను సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె రాధామోహన్ భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు.

సంపత్ నంది దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా 'గాంజా శంకర్‌‌‌‌‌‌‌‌’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోన్నట్లు అనౌన్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ మధ్యలోనే ఆగిపోయిందనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో సంపత్ నంది ఇదే కథను శర్వాకు తగ్గట్టుగా మార్చి తీయబోతున్నట్లు టాక్. ఏమవుతుందో చూడాలి. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. డైరెక్టర్ సంపత్ నంది ఏమైంది ఈ వేళతో ఎంట్రీ ఇచ్చి రచ్చ, బెంగాల్ టైగర్, గౌతం నంద, సీటిమార్ సినిమాలకు దర్శకత్వం వహించాడు.

ఇక ప్రస్తుతం శర్వా సినిమాల విషయానికి వస్తే..లూజర్ వెబ్ సీరీస్తో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అభిలాష్ రెడ్డి (Abilashreddy) తో తన 36 ఫిల్మ్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ కంప్లీట్ కూడా అయ్యాయి. అలాగే, మరోవైపు, శర్వానంద్ మరో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. గతేడాది హీరో శ్రీవిష్ణు కు సామజవరగమన వంటి బ్యూటిఫుల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందించిన రామ్ అబ్బరాజు (Ram Abbara)తో సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీని బడా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. 

మహా సముద్రం,ఆడవాళ్ళు మీకు జోహార్లు కమర్షియల్గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఒకే ఒక జీవితం సినిమా మాత్రం పర్వాలేదనిపించింది. అయితే, శతమానం భవతి, మహానుభావుడు వంటి సినిమాల తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ను ఇప్పటి వరకు శర్వానంద్ అందుకోలేకపోయారు. ఇపుడు లేటెస్ట్గా రాబోయే మూవీస్ తో అయిన సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.