Sharwanand: పిఠాపురంలో మొదటి ఈవెంట్ మాదే అవ్వాలి.. దద్దరిల్లిన ఆడిటోరియం

Sharwanand: పిఠాపురంలో మొదటి ఈవెంట్ మాదే అవ్వాలి.. దద్దరిల్లిన ఆడిటోరియం

చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మనమే(Manamey). ఎమోషనల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి(Krithi shetty) హీరోయిన్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన మనమే ట్రైలర్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. 

ఈ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. నిజానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముంగు పిఠాపురంలో జరపాలనుకున్నారు. రామ్ చరణ్ గెస్ట్ గా రానున్నట్లు న్యూస్ కూడా వైరల్ అయ్యాయి. కానీ, అక్కడ పర్మిషన్ రాకపోవడంతో ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఇదే విషయం గురించి హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. నిజానికి మనమే సినిమా ఈవెంట్ పిఠాపురంలో జరుపుదాం అనుకున్నాం. కానీ, అక్కడ ప్రస్తుతం పరిస్థితుల కారణంగా పర్మిషన్ దొరకలేదు. కానీ, మా మనమే సక్సెస్ ఈవెంట్ మాత్రం ఖచ్చితంగా అక్కడే జరుగుతుంది. పిఠాపురంలో జరిగే మొదటి ఈవెంట్ మాదే అవుతుంది..  అంటూ చెప్పుకొచ్చాడు శర్వా. 

 దాంతో ఆడిటోరియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఈలలు, గోళలతో రెచ్చిపోయారు ఫ్యాన్స్. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ తో ఎమ్మెల్యే గా గెలిచినా విషయం తెలిసిందే. దాంతో.. పిఠాపురం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఏపీగా మారిపోయింది. కాబట్టి మనమే సినిమా మేకర్స్ సక్సెస్ ఈవెంట్ ను అక్కడ చేయాలనీ ఫిక్స్ అయ్యారు.