Sharwanand: ఫ్యామిలీతో బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్న హీరో శర్వానంద్

Sharwanand: ఫ్యామిలీతో బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్న హీరో శర్వానంద్

టాలీవుడ్ హీరో శర్వానంద్ ఫ్యామిలీతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకున్నారు. నేడు ఏప్రిల్ 2న కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి అమ్మవారి తీర్థప్రసాదాలను అర్చకులు అందజేశారు.

ఇటీవలే (మార్చి 31న) ఫ్యామిలీతో కలిసి కృష్ణా జిల్లా, మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

శ‌ర్వానంద్ సినిమాల విషయానికి వస్తే..

ప్రస్తుతం శర్వానంద్ యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేస్తోన్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీని అభిలాష్‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో శ‌ర్వానంద్ బైక్ రైడ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. మాళవిక నాయర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు

అలాగే, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘నారీ నారీ నడుమ మురారి’ అనే మూవీ చేస్తున్నాడు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్‌‌. ఏకే ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.

లేటెస్ట్గా సంపత్ నంది డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో మరో సినిమాను ప్రకటించాడు. 1960 బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఇది తెరకెక్కనుంది. ఏప్రిల్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో సహా పలు భాషలలో సినిమా విడుదల కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.