గ్రేట్ కదా.. రూ.3 కోట్లు ఇస్తామంటే.. ఛీ పొమ్మన్నారు : బెట్టింగ్ యాప్స్ పై మధుమిత

గ్రేట్ కదా.. రూ.3 కోట్లు ఇస్తామంటే.. ఛీ పొమ్మన్నారు : బెట్టింగ్ యాప్స్ పై మధుమిత

టాలీవుడ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఇప్పటికే దాదాపుగా వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో పలువురు సినీ సెలెబ్రెటీలు ముందుకొచ్చి బెట్టింగులు ఆడద్దని చెబుతూ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై టాలీవుడ్ హీరో శివ బాలాజీ దంపతులు స్పందించారు. 

ఇందులో భాగంగా తమకి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే దాదాపుగా రూ.3 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలిపారు. కానీ తాము మాత్రం తమ ఈ ఆఫర్స్ రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. మధుమిత మాట్లాడుతూ ఫాలోవర్స్ ని తమ ఫ్యామిలీ మెంబర్స్ గా భావిస్తామని దీంతో తమవల్ల తమ ఫాలోవర్స్ కి ఎలాంటి నష్టం జరగకూడదని, అలాగే వారిని తప్పుదోవ పట్టించకూడదనే ఉద్దేశంతోనే ఇలాంటివి ప్రమోట్ చెయ్యలేదని తెలిపింది. అయితే యూట్యూబ్ ఛానెల్, ఫేస్ బుక్ పేజీలు ఉన్నవారకి ఆటోమేటిక్ గా ప్రమోషన్స్ వస్తాయని కానీ ఏది మంచిది, ఏది చెడ్డది అని తెలుసుకుని ప్రమోట్ చెయ్యాలని లేకపోతే మాత్రం చిక్కులు తప్పవని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ  శివ బాలాజీ దంపతులని అభినందిస్తున్నారు.

ఇక నటుడు శివబాలాజీ కెరీర్ విషయనికొస్తే ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్, సీజీ పనులు పూర్తీ కాకపోవడంతో రిలీజ్ వాయిదా పడింది. శివబాలాజీ మా అసోసియేషన్ లో ట్రెజరర్ గా కూడా పని చేస్తున్నాడు. నటి మధుమిత విషయానికొస్తే పెళ్లి తర్వాత సినిమాలకి పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం శివమధు అనే యూట్యూబ్ ఛానెల్ ని నిర్వహిస్తోంది. ఇందులో వంటలు, లైఫ్ స్టైల్ కి సంబందించిన వీడియోలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తోంది.