హీరో షో రూమ్ డీలర్ల మధ్య పంచాయితీ.. బైక్ లు డ్యామేజ్ చేసిన ఖమ్మం డీలర్

హీరో షో రూమ్ డీలర్ల మధ్య పంచాయితీ..  బైక్ లు డ్యామేజ్ చేసిన ఖమ్మం డీలర్

 

  • పోలీసులకు కంప్లయింట్ చేసిన బాధితుడు

పెనుబల్లి, వెలుగు :  హీరో బైక్స్ షో రూమ్స్ ఓనర్స్  రేట్ల లొల్లితో పరస్పరం దాడికి దిగిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. పెనుబల్లి మండలం వీఎం బంజరులో దుర్గ మోటార్స్ హీరో షో రూం ఓనర్ చైతన్య రెడ్డి ఖమ్మంలోని శ్రీశ్రీశ్రీ హీరో మెయిన్ షో రూం ఓనర్ ఈశ్వరప్రగడ హరిబాబు వద్ద కంపెనీ బైక్ లను తీసుకెళ్లి అమ్మేవాడు. 

కాగా ఇద్దరి మధ్య బైక్ ల ధరల్లో తేడా ఉండటంతో ఆరు నెలలుగా ఖమ్మం షోరూం నుంచి కాకుండా తక్కువ ధరకు వచ్చే వేరే షోరూం నుంచి బైక్ లను చైతన్యరెడ్డి తెచ్చి అమ్ముతున్నాడు. దీంతో అతనితో పాటు జిల్లాలో మరికొందరు డీలర్లు తమ వద్దకు రావడం లేదని అనుమానిస్తూ.. బుధవారం సాయంత్రం చైతన్యరెడ్డి షోరూంకు హరిబాబు, అతని కొడుకు రంగనాథ్ వెళ్లి వర్కర్స్ తో గొడవపడ్డారు. 6 బైక్ లను ధ్వంసం చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ తో షోరూం ఓనర్ చైతన్యరెడ్డి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.