భాగస్వామి అంటూ బర్త్డే విషెస్.. దీనంతటీకీ కారణం ఆ డైరెక్టరేనా!

హీరో సిద్ధార్థ్ (Siddharth),  హీరోయిన్ అదితీరావు హైదరి (Aditi Rao Hydari) ప్రేమలో ఉన్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ 2021 లో వచ్చిన మహాసముద్రం మూవీలో కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని వార్తలు షికారు చేశాయి. ఎన్ని వార్తలు వస్తున్నా..వీరిద్దరు మాత్రం ఖండించడం లేదు. పైగా ఫంక్షన్లు, టూర్లకు తిరుగుతూ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నారు. 

తాజాగా సిద్ధార్థ్ అదితి రావ్ హైదరీ తన 37వ పుట్టినరోజు స్పెషల్ గా ఇన్స్టాగ్రామ్ లో  పోస్ట్ చేసిన  ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదితి రంగురంగుల సన్ గ్లాసెస్‌తో కూర్చుని ఉన్న బ్యూటిఫుల్ పిక్ తో పాటు..ఇద్దరూ రొమాంటిక్ గా తీసుకున్న సెల్ఫీ ఫోటో కూడా షేర్ చేశాడు.

అలాగే వీటితో పాటుగా..హైదరీ పై సిద్దార్ద్ రాసిన కవితలో..హ్యాపీ బర్త్డే పార్ట్నర్ అంటూ.. ఎంతో అర్ధాన్ని వివరిస్తూ..'ఆమె మనోహరమైనది కాదా? పుట్టినరోజు శుభాకాంక్షలతో మీరు హాయిగా ఉండండి. మీ ముఖంపై చిరునవ్వు కోసం అందరూ వేచి ఉన్నారని..  మీరు ఆనందంగా ఉండాలని..ఇది ఎల్లప్పుడూ సాధ్యమయ్యేలా చేయాలనీ..తప్పకుండా త్వరలో కలుద్దాం అంటూ..లవ్ సింబల్స్ తో పోస్ట్ చేశాడు.

ALSO READ :- కేసీఆర్ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం : హరీష్​రావు

దీంతో త్వరలో వీరి పెళ్లి కన్ఫర్మ్ అనే సంకేతాలు ఇచ్చాడు సిద్ధార్ద్. అంతేకాకుండా భాగస్వామి అంటూ..సంబోదించడంటే ఫ్యాన్స్ కు అర్ధమయ్యే ఉంటుంది. పెళ్లి బాజా మోగిస్తారని.  ప్రస్తుతం సిద్ధార్ద్ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.  సిద్దార్ద్ పోస్ట్ కు మహా సముద్రం డైరెక్టర్ అజయ్ భూపతి (Ajay Bhupathi) ట్వీట్ చేస్తూ..'దీనంతటికీ కారణం నేనేనా? అసలేం జరుగుతోంది' అంటూ..సిద్ధార్ద్..హైదరీ ఉన్న ఫొటోస్ షేర్ చేశాడు. 

వీరిద్దరూ గతంలో వివాహం చేసుకున్నారు. అదితి హైదరీ.. యాక్టర్ సత్యదీప్ మిశ్రాను మ్యారేజ్ చేసుకుంది, ఇప్పుడు ఇతనేమో డిజైనర్ మసాబా గుప్తాను వివాహం చేసుకున్నాడు. హీరో సిద్ధార్థ్ నవంబర్ 2003లో మేఘనను మ్యారేజ్ చేసుకుని..జనవరి 2007లో విడాకులు తీసుకున్నారు.