Miss You movie Trailer: ఇంట్రెస్టింగ్ గా సిద్దార్థ్ "మిస్ యూ" ట్రైలర్.. ఇది హర్రర్ స్టోరీ కాదు.. లవ్ స్టోరీ..

Miss You movie Trailer: ఇంట్రెస్టింగ్ గా సిద్దార్థ్ "మిస్ యూ" ట్రైలర్.. ఇది హర్రర్ స్టోరీ కాదు.. లవ్ స్టోరీ..

Miss You movie Trailer: తెలుగులో బొమ్మరిల్లు సినిమాతో మంచి క్లాసికల్ హిట్ అందుకున్న హీరో సిద్దార్థ్ మళ్ళీ ఆ తరహాలో ఫ్యాన్స్ ని అలరించ లేకపోయాడు. మంచి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న సిద్దార్థ్ మధ్యలో కొన్ని యాక్షన్ & సీరియస్ పాత్రలు చేశాడు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే ఈసారి మిస్ యూ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నాడు.

సిద్ధార్థ్ కి జోడీగా యంగ్ హీరోయిన్ ఆశికా రంగనాథ్ నటిస్తుండగా తమిళ్ ప్రముఖ డైరెక్టర్ ఎన్. రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. 7 మైల్స్ పర్ సెకెండ్ బ్యానర్ పై తమిళ్ ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ సామ్యూల్ మాథ్యూ నిర్మిస్తున్నాడు. క్లాసికల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ శనివారం (నవంబర్ 23) రిలీజ్ అయ్యింది. ట్రైలర్ విశేషాలేంటో చూసేద్దాం.. 

ALSO READ | Kissik Promo: కిస్సిక్ సాంగ్ ప్రోమో రిలీజ్.. చిన్న బిట్టుతోనే భూకంపం సృష్టించారుగా!

మొదటగా హీరో సిద్దార్థ్ ఇదొక లవ్ స్టోరీ రా.. అంటూ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. పని మీద బెంగళూరు వెళ్లిన సిద్దార్థ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ ని చూసి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆమెని ఒప్పించడానికి పడే క్రమంలో కొన్ని కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నైట్ షోకి వెళ్ళినప్పుడు నిద్ర వస్తే ఎం చేస్తారంటూ ఆషికా చెప్పే ఇన్నోసెంట్ డైలాగ్స్ నవ్వు తెప్పిస్తాయి. ఇక కొన్ని సీన్స్ తర్వాత చివరిలో ప్రేమలో పడిన ఇద్దరూ పెళ్లి చేసుకోబోయే టైంలో ఎందుకు విడిపోయారు..? ఏమైందనే విషయాలపై  సస్పెన్స్ క్రియేట్ చేశారు. చివర్లో మనకి నచ్చినదానికోసం అన్ని విధాలా ట్రై చెయ్యాలి అనే చెప్పే డైలాగ్ ట్రైలర్ కె హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు. 

మన జీవితాల్లో హర్రర్ & లవ్ స్టోరీ స్క్రిప్ట్స్ ఒకటే మావా అనే డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది. ట్రైలర్ మొదట్లో ఇదొక లవ్ స్టోరీ అని చేపినప్పటికీ మధ్యలో కొన్ని పొలిటికల్ ఎలిమెంట్స్ కనబడ్డాయి. మిస్ యూ సినిమా నవంబర్ 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ తో ఆకట్టుకున్న సిద్దార్థ్ థియేటర్లలో ఎలా అలరిస్తాడో చూడాలి.