ఈ సంక్రాంతికి తెలంగాణ అల్లుడిగా వస్తున్నా: సిద్దార్థ్

ఈ సంక్రాంతికి తెలంగాణ అల్లుడిగా వస్తున్నా: సిద్దార్థ్

సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్ జంటగా ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో శామ్యూల్ మాథ్యూ నిర్మించిన చిత్రం ‘మిస్ యు’. నవంబర్ 29న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ ఎల్‌‌ఎల్‌‌పీ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌‌లో ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. సిద్ధార్థ్​  మాట్లాడుతూ ‘వచ్చే సంక్రాంతి నాకు చాలా ఇంపార్టెంట్. ఇరవై ఏళ్ల క్రితం సంక్రాంతికి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చాను. ఇప్పుడు తెలంగాణ అల్లుడుగా ఈ సంక్రాంతికి వస్తున్నా. 

లవ్ స్టోరీస్‌‌కు దూరంగా ఉంటున్న నాకు డైరెక్టర్ రాజశేఖర్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ ప్రపంచంలో  నచ్చని అమ్మాయిని  ప్రేమించే అబ్బాయి కథ ఇది. ఇందులో ఒక నెగిటివిటీ, వైలెన్స్, రక్తపాతం లాంటివి ఏమీ లేవు. ఫీల్ గుడ్ సినిమా. ఈ చిత్రం విజయం సాధిస్తేనే మళ్లీ లవ్ స్టోరీస్ చేస్తాను’ అని చెప్పాడు. ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ ‘ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్. ఇందులో ఇండిపెండెంట్ గర్ల్‌‌గా కనిపిస్తా. 

కచ్చితంగా అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని చెప్పింది.  ఇదొక బ్యూటిపుల్ లవ్‌‌స్టోరీ, ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌‌గా ఉన్నామని దర్శకుడు రాజశేఖర్ చెప్పాడు.  తెలుగులో  ఏషియన్ సురేష్ సంస్థ ద్వారా మా సినిమా రిలీజ్ అవడం హ్యాపీ అన్నారు నిర్మాత శామ్యూల్ మాథ్యూ . ఈ  కార్యక్రమంలో జాహ్నవి నారంగ్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.