Siddu Jonnalagadda: వరదలు ముంచెత్తడం బాధాకరం..తెలుగు రాష్ట్రాలకు సిద్దు జొన్నలగడ్డ సాయం

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భారీ ఆస్థి ప్రాణ జరిగింది. కొన్ని చోట్ల ప్రజలు తమ ఆవాసాలను కోల్పోయారు. తినడానికి తిండి తాగటానికి మంచి నీళ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు మేము సైతం అంటూ ముందడుగు వేసింది. 

తాజాగా యంగ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రెండు తెలు రాష్ట్రాల ప్రజల కోసం తన వంతు సాయాన్ని ప్రకటించారు. వరద బాధితులకు తన వంతు సహకారంగా రూ.30 లక్షల ఆర్థిక సాయాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి వరద సహాయ నిధికి ప్రకటిస్తున్నాని తెలిపారు. (రూ.15లక్షలు తెలంగాణ వరద సహాయ నిధికి,  మరో రూ.15లక్షలు ఆంధ్రప్రదేశ్ వరద సహాయ నిధికి అందించారు)

ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తడం బాధాకరమైన విషయం. ప్రస్తుతం ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే..ఇంకెవ్వరికే ఇలాంటి ఆపద రాకుండదని విచారం వ్యక్తం చేశారు సిద్ధు. దీంతో ఇపుడే ఎదుగుతున్న హీరో అయినప్పటికీ..భారీ సాయం ప్రకటించడంతో టాలీవుడ్ ప్రముఖుల నుంచి, తన అభిమానుల నుంచి సిద్దు జొన్నలగడ్డకు ప్రశంసలు అందుతున్నాయి.

ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల విరాళం ప్రకటించగా..యంగ్  హీరో విశ్వక్ సేన్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.5 డొనేట్ చేశాడు.ఇదిలా ఉండగానే తాజాగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాతలు నాగవంశీ, ఎస్ రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా రెండు రాష్ట్రాలకు కలిపి రూ.50 లక్షల ఆర్థిక సహయం చేశారు.