AP/TG Floods: మానవత్వం చాటుకొన్న హీరో శింబు..కోలీవుడ్ నుంచి విరాళం ఇచ్చిన మొదటి హీరో

AP/TG Floods: మానవత్వం చాటుకొన్న హీరో శింబు..కోలీవుడ్ నుంచి విరాళం ఇచ్చిన మొదటి హీరో

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఆస్థి, ప్రాణ నష్టం చాలా వరకు జరిగింది. కొన్ని చోట్ల ప్రజలు తమ ఆవాసాలను కోల్పోయారు. తినడానికి తిండి, తాగటానికి మంచి నీళ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. విజయవాడ - ఖమ్మం పూర్తిగా నీట మునిగాయి. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టి చాలా మందిని కాపాడింది. ఈ నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమలో నటి నటులు, నిర్మాతలు ముందడుగు వేసి తమ వంతు సాయాన్ని ప్రకటించి శభాష్ అనిపించుకున్నారు.

ఈ క్రమంలో ఒక్క తమిళ హీరో నేను సైతం అంటూ సాయాన్ని ప్రకటించాడు. అతనే తమిళ నటుడు సిలంబరసన్ శింబు (Silambarasan Simbhu). ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు కలిపి ముఖ్యమంత్రి వరద సహాయ నిధికి రూ. 6 లక్షలు ప్రకటించారు. వరద బాధిత తెలుగు రాష్ట్రాలకు సహాయాన్ని అందించిన మొదటి తమిళ నటుడిగా శింబు నిలిచాడు. ఈ హీరో తెలుగులో ఒక్క స్ట్రయిట్ సినిమా కూడా చేయని శింబు తెలుగు ప్రజలకు చేసిన సాయానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ‘ఎంత చేసారు అన్నది కాదు.. ఇవ్వాలి అన్న సంకల్పం ముఖ్యం’ అని శింబు పై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శింబుపై తమిళ  ఫ్యాన్స్, తెలుగు ఫ్యాన్స్ కూడా అతన్ని అభినందిస్తున్నారు. 

ఈ క్రమంలో ఆయన చేసిన సాయంతో మరింత మంది అభిమానుల్లో చోటు సంపాదించుకొన్నారనే చెప్పాలి. శింబు మనకు తెలుగులో వల్లభ, మన్మధ.. లాంటి పలు సినిమాలతో దగ్గరైన సంగతి తెలిసిందే. ఇటీవల శింబు మానాడు, పాతుతల సినిమాలతో మంచి విజయాలు సాధించాడు.

Also Read : ‘ది గోట్‌' నెగిటివ్ రివ్యూలపై

అయితే, మన హీరోలు, నిర్మాతలు మనకి కష్టం వచ్చిన ముందుంటారు. పక్క రాష్ట్రాలకు కష్టం వచ్చిన ముందుంటారు. కానీ, మనకి ఇంత కష్టం ప్రకృతి విలయం సంభవించిన ఏ ఒక్క పక్క రాష్ట్రాల నటులు ముందుకు రాలేదు. మరోపక్క ఒక్కో సినిమాకు రూ. 100ల కోట్లు తీసుకునే ఫ్యామిలీ ఫెమస్ స్టార్ లు, స్పెషల్ సాంగ్ కు కోట్లు తీసుకునే హీరోయిన్స్ ఒక రూపాయి కూడా ఇవ్వకపోవడం పట్ల నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.