విడాకులపై క్లారిటీ ఇచ్చిన స్టార్ కపుల్... ఆ టైమ్ లో అలా చెయ్యడం కరెక్ట్ కాదంటూ...

విడాకులపై క్లారిటీ ఇచ్చిన స్టార్ కపుల్... ఆ టైమ్ లో అలా చెయ్యడం కరెక్ట్ కాదంటూ...

టాలీవుడ్ లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమాలో అజయ్ పాత్రలో నటించిన శివబాలాజీ తెలుగు ఆడియన్స్ కి బాగానే గుర్తుంటాడు. అయితే శివబాలాజీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పలు సినిమాల్లో ఫుల్ టైమ్ హీరోగా నటించాడు. ఆ తర్వాత గెస్ట్ రోల్స్, కామియో అప్పియరెన్స్ వంటి పాత్రల్లో ఆకట్టుకున్నాడు. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని విజేతగా నిలిచాడు. ఇటీవలే నటుడు శివబాలాజీ తన భార్య మధుమితతో కలసి ఓ ఇంటర్వూలో విడాకుల గురించి స్పందించాడు. ఇందులో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

మధుమిత మాట్లాడుతూ తన భర్త అప్పుడప్పుడూ తనతో విడాకులు తీసుకుందామని బెదిరించేవాడని దీంతో తాను కూల్ గా హ్యాండిల్ చేసేదానినని తెలిపింది. అయితే పెళ్లయిన ఏడాదికే జరిగిన ఓ సంఘటనతో విడాకులు తీసుకోవాలని అనుకున్నామని కానీ పిల్లలు, ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకుని విడాకుల వరకూ వెళ్లకుండా మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నామని చెప్పుకొచ్చింది. అలాగే ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనస్పర్థలు,విభేదాలు రావడం సహజమని అలాగని వాటిని సీరియస్ గా తీసుకుని విడిపోయి లైఫ్ ని నాశనం చేసుకోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 

ఇక శివబాలాజీ మాట్లాడుతూ ఈమధ్య కాలంలో కొందరు పెళ్లయిన రెండు మూడేళ్లు కూడా గడవకముందే చిన్నచిన్న విషయాలకే అపార్థం చేసుకుని విడిపోతున్నారని ఇది సరికాదని అన్నాడు. అలాగే మన లైఫ్ లోని అమ్మనాన్నలు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మాదిరిగానే భార్యని కూడా ఎప్పటికీ మార్చలేమని ఈ విషయాన్ని తాను బాగా నమ్ముతానని తెలిపాడు. ఇక ఫైనల్ గా విడాకుల విషయంలో జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తొస్తే మాత్రం ఇప్పుడు నవ్వొస్తుందని చెప్పుకుకొచ్చాడు. దీంతో శివబాలాజీ విడాకుల గురించి వినిపిస్తున్న పుకార్లకు చెక్ పడింది.

ఈ విషయం ఇలా ఉండగా నటుడు శివబాలాజీ, మధుమిత 2009లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐతే నటి మధుమిత కూడా ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. హీరో అర్జున్ నటించిన పుట్టింటికి రా చెల్లి.. సినిమా సొప్పర్ హిట్ అయ్యింది. పెళ్లయిన తర్వాత నటనకి గుడ్ బై చెప్పి ఇంటి పట్టునే ఉంటోంది. నటుడు శివబాలాజి మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)లో ట్రెజరర్ గా పని చేస్తున్నాడు.