
తమిళ స్టార్ శివ కార్తికేయన్ (Siva Karthikeyan) హీరోగా వస్తన్న లేటెస్ట్ మూవీ అమరన్ (Amaran). మేజర్ ముకుంద్ వరదరాజన్ (Mukund Varadharajan) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periyaswami) తెరకెక్కిస్తున్నాడు.
లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన టీజర్, సాంగ్స్ ఆడియన్స్ పై అంచనాలు పెంచేసింది. ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ అమరన్ ఆడియో లాంఛ్ ఈవెంట్ శుక్రవారం అక్టోబర్ 19న చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఆడియో లాంఛ్ ఈవెంట్‌కు స్టార్ డైరెక్టర్స్ మణిరత్నం, లోకేష్ కనగరాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలో సహజ నటి సాయిపల్లవిపై హీరో శివకార్తికేయన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రేమమ్ చూసి తాను సాయిపల్లవికి ఫ్యాన్‌గా మారిపోయినట్లు తెలిపాడు. అలాగే ప్రేమమ్ సినిమా బాగుంది.. మీ యాక్టింగ్ ఇంకా బాగుందని సాయిపల్లవికి ఫోన్ చేసి చెబితే.. 'థాంక్యూ అన్న' అంటూ రిప్లై ఇచ్చిందని తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు. దీంతో అప్పుడే ఫిక్స్ అయ్యాను.. 'భవిష్యత్తులో తప్పకుండా సాయిపల్లవితో మూవీ చేయాలని అనుకున్నా. ఇక ఇపుడు అమరన్‌తో అది నిజమైందని శివకార్తికేయన్ అన్నాడు. దాంతో చాలాకాలం నాటి స్వీట్ మెమోరీ చెప్పుకోవడంతో ఇరువురి ఫ్యాన్స్ ఖుషి అవుతూ.. 'సాయిపల్లవి బ్రాండ్ సార్ అదంతా' అంటూ ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ | LEO2: లియో నుంచి చాలా నేర్చుకున్నాను.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఎమోషనల్ ట్వీట్
సాయిపల్లవి సినిమాల నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు. 2022లో వచ్చిన గార్గి తర్వాత ఆమె నటించిన ఏ చిత్రం కూడా రిలీజ్ కాలేదు. అయితే ప్రస్తుతం ఆమె వరుసగా సినిమాలు చేస్తున్నారు. సాయిపల్లవి లైనప్‍లో నాలుగు చిత్రాలు ఉన్నాయి. అయితే, సాయిపల్లవిని మళ్లీ వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు వేచిచూస్తున్నారు. ఈ తరుణంలో అమరన్ రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే.. రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ఈ సినిమాని రచయితలు శివ్ అరూర్,రాహుల్ సింగ్ రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ పుస్తకంలోని ఓ చాప్టర్ ఆధారంగా ఈ మూవీని డైరెక్టర్ రూపొందిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.