టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు(SreeVishnu) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల సామజవరగమన (Samajavaragamana) సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు..ఆ తర్వాత ఓం భీమ్ బుష్(Om Bheem Bush) అనే కామెడీ ఎంటర్టైన్మెంట్ తో అలరించాడు. ప్రస్తుతం రాజ రాజ చోర సినిమాతో తనకు మంచి హిట్ అందించిన దర్శకుడు హసిత్ గోలితో స్వాగ్ (Swag) మూవీ చేస్తున్నాడు.
ట్రైలర్ ఎలా ఉందంటే?
తాజాగా స్వాగ్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 2:32 సెకన్లు ఉన్నఈ ట్రైలర్ మొదటి నుంచీ చివరి వరకూ నవ్విస్తూనే ఉంది. మొన్ననే ఫ్రెంచ్ యువరాణిని ఏకాంతంగా కలిశాం అని శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. 1551లో మొదలైన ఈ కథ ప్రస్తుతం వరకు దాదాపు నాలుగు టైమ్ లైన్స్‌లో ఉండనుంది. అందులో స్వాగనిక వంశ యువరాజుగా శ్రీవిష్ణు క్యారెక్టర్ ని రివీల్ చేశారు. తరువాత స్వాగానిక వంశమట.. దేశంలో ఏ మగాడైనా వాళ్లకి మొక్కాల్సిందే అనే డైలాగ్ తో ఆ వంశ చరిత్రని చెప్పారు.
ALSO READ | Devara OTT: కళ్లు చెదిరే ధరకు దేవర ఓటీటీ రైట్స్!.. స్ట్రీమింగ్ అయ్యేది ఆ పండుగకే?
మొత్తానికి శ్రీ విష్ణు తన స్వాగ్, కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. శ్రీ విష్ణు 'సింగ, భవభూతి, యయాతి, కింగ్ భవభూతి' అనే నాలుగు డిఫరెంట్ షేడ్స్, భిన్నమైన డైలాగ్ డెలివరీతో శ్రీ విష్ణు ఆకట్టుకున్నాడు. పురుషాధిక్యం అనే పాయింట్ ఆధారంగా స్వాగ్ సినిమా తీసినట్లు అర్థమవుతోంది.
ఓవరాల్ గా చెప్పాలంటే.. స్వాగ్’ మూవీ కథాంశం అంతా ఒక నిధి. ఆ నిధికి సంబందించిన స్వాగనిక వారసుడి చుట్టూ తిరగబోతోందని స్పష్టం అవుతోంది. మొత్తం మీద ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
టీజర్ ఎలా ఉందంటే?
స్వాగ్ టీజర్ కొన్నివందల ఏళ్ల కిందట అసలు మగ బిడ్డ పుడితే చంపేసే రోజుల్లో షురూ అయింది. అప్పట్లో వింజమర వంశానికి రాణిగా ఉన్న రుక్మిణీ దేవి (రీతూ వర్మ).. మగవాళ్లపై ద్వేషంతో తన వంశంలో మగబిడ్డ పుట్టకూడదని అనుకుంటుంది. ఒకవేళ పుట్టినా చంపేస్తానంటుంది. ఆ సమయంలో ఈ వంశంలో ఇక మగ పిల్లాడు పుట్టడు అంటూ శ్రీ విష్ణు ఎంట్రీ ఇస్తాడు. కట్ చేస్తే ఈ కాలంలో ఆడవాళ్లతో ఆడుకునే వ్యక్తిగా శ్రీ విష్ణు కనిపిస్తాడు. ఇక గత జన్మలో మగ వాళ్లను ద్వేషించే రాణిగా ఉన్న రీతూ వర్మ..ఇప్పుడు అతనికి బానిసగా మారిపోతుందని ఇదివరకే రిలీజైన టీజర్ లో చూపించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో శ్రీవిష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.