SWAG Twitter X Review: శ్రీ విష్ణు 'స్వాగ్' ట్విట్టర్ X రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

SWAG Twitter X Review: శ్రీ విష్ణు 'స్వాగ్' ట్విట్టర్ X రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తున్న శ్రీవిష్ణు.. నేడు శుక్ర‌వారం (అక్టోబర్ 4న) ‘స్వాగ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘రాజ రాజ చోర’ తర్వాత దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతను నటిస్తున్న రెండో సినిమా ఇది. ఈ మూవీలో రీతూవ‌ర్మ‌, మీరాజాస్మిన్ కీల‌క పాత్ర‌లు చేశారు. 

టీజర్, ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన స్వాగ్ సినిమాకు.. ఇప్పుడు థియేటర్లలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రీ విష్ణు కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు. సింగ క్యారెక్టర్ హిలేరియస్ అని, మిగిలిన మూడు పాత్రలు కూడా అదిరిపోయాయని అంటున్నారు. మూవీ చూసొచ్చిన వాళ్లు ఇంకా ఏమేం అంటున్నారనేది ట్విటర్ X రివ్యూలో చూద్దాం. 

ALSO READ | Devara Success Meet: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు బిగ్ షాక్ .. దేవర సక్సెస్ ఈవెంట్ లేదు.. కారణం ఇదే!

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ తో చూడని చిత్రం స్వాగ్. డైరెక్టర్ హసిత్ గోలి మంచి కాన్సెప్ట్‌ను మంచి స్క్రీన్ ప్లేతో ఎలాంటి లోపాలు లేకుండా తెరకెక్కించారు.నాలుగు విభిన్నమైన పాత్రలతో ఆ క్యారెక్టర్లకు తగినట్టుగా శ్రీ విష్ణు  డబ్బింగ్ చెప్పి ఆకట్టుకోవడంతో పాటు.. అద్బుతంగా పెర్ఫార్మెన్స్ చేశారని సినిమా చూసిన ఓ నెటిజన్ ట్విట్టర్ X లో పోస్ట్ చేశారు. 

స్వాగ్ మూవీ హై ఎమోషనల్ డ్రామాతో కూడిన ఉల్లాసకరమైన మూవీ అని..హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి ఇద్దరు కలిసి మరో కొత్త యుగం చూసిన ఫీలింగ్ ని.. ఈ సినిమాతో తెరపైకి తీసుకొచ్చారు. ఇదొక స్వచ్ఛమైన శ్రీవిష్ణు వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఇందులో మీరాజాస్మిన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉందని ఓ నెటిజన్ తెలిపారు. 

స్వాగ్ సినిమా ఇప్పుడే చూశాను. శ్రీ విష్ణు తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాకు కలెక్షన్లతోపాటు అవార్డు కూడా రావడానికి అవకాశం ఉన్న సినిమా. హసిత్ గోలి తెలుగు సినిమాకు దొరికిన వరం అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

తెలుగులో అరుదుగా వచ్చే సినిమా కథ ఇది. హసిత్ గోలి రాసిని ఈ కథను ప్రేక్షకులు చాలా కాలం గుర్తుంచుకొంటారు. ప్రతీ పాత్రను శ్రీ విష్ణు అద్బుతంగా పోషించాడు. కమల్ హాసన్‌ను మరోసారి గుర్తు చేశాడు. ఈ సినిమాను థియేటర్లలోనే చూడండి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

స్వాగ్ ఫస్టాఫ్ ఒకేలా ఉంది. సెకండాఫ్ ఎటో వెళ్లిపోతుంది. కానీ దర్శకుడు హసిత్ గోలిపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఆయన నిరాశ పరచరనే అభిప్రాయం నాకు ఉంది. కాస్త వెయిట్ చేయండి.. పూర్తి రివ్యూ ఇస్తాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.