Srikanth: నేను రేవ్ పార్టీలు, ప‌బ్‌ల‌కు వెళ్లే వ్యక్తిని కాదు.. తప్పుడు కథనాలు నమ్మకండి: హీరో శ్రీకాంత్

Srikanth: నేను రేవ్ పార్టీలు, ప‌బ్‌ల‌కు వెళ్లే వ్యక్తిని కాదు..  తప్పుడు కథనాలు నమ్మకండి: హీరో శ్రీకాంత్

బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, పార్టీలకు, ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని కాదని హీరో శ్రీకాంత్(Srikanth) స్ప‌ష్టం చేశారు. ఇదే విషయంలో తన పేరు వినిపించడంపై త‌న ఇంటి నుండి  ప్ర‌త్యేకంగా వీడియో బైట్ విడుద‌ల చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. నేను హైద‌రాబాద్‌లో మా ఇంట్లోనే ఉన్నాను. నేను బెంగుళూరు రేవ్ పార్టీకి వెళ్లిన‌ట్లు, పోలీసులు నన్ను అరెస్ట్ చేసిన‌ట్లు ఉదయం నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. 

మీడియాలో నేను బెంగుళూరు రేవ్ పార్టీకి వెళ్లాన‌ని వార్త‌లు వ‌చ్చాయి. అది చూసి చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు. కానీ, నేను మా కుటుంబ స‌భ్యులు మాత్రం ఆ న్యూస్ చూసి న‌వ్వుకున్నాం. మొన్న‌మో నా విడాకుల గురించి రాశారు, ఇప్పుడేమో రేవ్ పార్టీకెళ్లాన‌ని అంటున్నారు. ఈ వార్త‌లు రాసిన వాళ్ళది కూడా త‌ప్పులేద‌నిపించింది. ఎందుకంటే..  ఆ రేవ్ పార్టీలో దొరికిన‌ వ్యక్తి కొంచెం నాలాగే ఉన్నాడు.

అత‌డికి కాస్త గ‌డ్డం ఉంది, ముఖం క‌వ‌ర్ చేసుకున్నాడు, అది చూసి నేనే షాక‌య్యాను. ద‌య‌చేసి ఈ వార్తలను న‌మ్మొద్దు. ఎందుకంటే.. నేను రేవ్ పార్టీల‌కు, ప‌బ్స్ వెళ్లే వ్య‌క్తిని కాదు. అసలు రేవ్ పార్టీలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియ‌దు. నిజానిజాలు తెలుసుకోకుండా.. రేవ్ పార్టీలో ప‌ట్టుబ‌డ్డ శ్రీకాంత్ అని రాస్తున్నారు. ఆ వ్యక్తిని చూసి మీరు కూడా  పొర‌బ‌డి ఉంటార‌ని అనుకుంటున్నాను. నేను మా ఇంట్లోనే ఉన్నాను. ద‌య‌చేసి త‌ప్పుడు క‌థ‌నాల‌ను నమ్మకండి.. అంటూ చెప్పుకొచ్చాడు హీరో శ్రీకాంత్.