బఘీర లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్

బఘీర లార్జర్ దేన్  లైఫ్ క్యారెక్టర్

శ్రీమురళి, రుక్మిణి వసంత్ జంటగా డాక్టర్ సూరి డైరెక్ట్ చేసిన కన్నడ చిత్రం ‘బఘీర’. దర్శకుడు ప్రశాంత్ నీల్ కథను అందించగా, హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  విజయ్ కిరగందూర్ నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమా విడుదల కానుంది.  ఏషియన్ సురేష్​ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ ఎల్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌పీ ద్వారా ఈ చిత్రం తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా శ్రీమురళి మాట్లాడుతూ ‘నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘ఉగ్రమ్’లాంటి సక్సెస్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ దీనికి స్టోరీ ఇచ్చారు. ఈ కథకు  డైరెక్టర్ సూరి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు.

యూనివర్సల్ అప్పీల్ ఉన్న కంటెంట్ ఇది. స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌కి ఏం కావాలో అవన్నీ బాగా ఎగ్జిక్యూట్  చేశారు సూరి. నాది లార్జర్ దేన్  లైఫ్ క్యారెక్టర్.  పర్సనల్‌‌‌‌‌‌‌‌గా ఇది నాకు చాలా ఫేవరెట్ క్యారెక్టర్. దీనికోసం మూడేళ్లు కష్టపడ్డా. చాలా స్ట్రిక్ డైట్ చేశా. మంచి కథతో పాటు రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్  క్యారెక్టర్స్ ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు  కనెక్ట్  అవుతాయి.  సూరి గారి లాంటి బ్రిలియంట్ టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌తో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్. అజనీష్  బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. లవ్ ట్రాక్, ఎమోషనల్ ట్రాక్స్ , కథని డ్రైవ్ చేస్తూ  బాగా కుదిరాయి. ఫైనల్‌‌‌‌‌‌‌‌గా నన్ను ఒక న్యూ బోర్న్ యాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  చూసి  బ్లెస్స్ చేయమని కోరుతున్నా.  ప్రతి ఒక్కరిలో హీరో ఉంటాడు. ఆ హీరో ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. 'బఘీర' సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా 'బఘీర'లా ఫీల్ అవుతారని నమ్ముతున్నా’ అని చెప్పాడు.