Mr.Celebrity Teaser: పరుచూరి మనవడు హీరోగా ఎంట్రీ..ఆసక్తి కలిగించేలా టీజర్

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్‌ పరుచూరి కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘మిస్టర్‌ సెలెబ్రిటీ’.‘‘సినిమాలో ఎప్పుడైనా ప్రేక్షకుడు ఊహించింది జరగాలి..కానీ ఊహించని టైంలో జరగాలి.‘మిస్టర్ సెలెబ్రిటీ’ చిత్రంలో అలాంటి ఊహించని మలుపులు ఉన్నాయి’’ అన్నారు రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు. చందిన రవి కిషోర్ దర్శకత్వంలో  ఎన్. పాండురంగారావు, చిన్నరెడ్డయ్య   ఈ  సినిమాని నిర్మిస్తున్నారు.

సోమవారం జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌లో పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘సెలెబ్రిటీల మీద బయట వచ్చే రూమర్లను బేస్ చేసుకుని ఈ కథను రాసుకున్న దర్శకుడు రవి కిషోర్ సినిమాను బాగా తీశారు. ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారు’ అని చెప్పారు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంతో పరిచయమవడం ఆనందంగా ఉందని సుదర్శన్ చెప్పాడు.

కామన్ మ్యాన్‌‌‌‌ నుంచి సెలెబ్రిటీల వరకు ఇబ్బంది పడే ఇష్యూని ఇందులో చూపించబోతున్నట్టు  డైరెక్టర్ రవి కిషోర్ తెలిపాడు. ఈ జనరేషన్‌‌‌‌కు తగ్గ కంటెంట్‌‌‌‌ ఇందులో ఉందని నిర్మాతలు తెలియజేశారు. నటుడు రఘుబాబు, రైటర్ సాయి మాధవ్ బుర్రా సహా టీమ్ అంతా పాల్గొన్నారు.