సుధీర్ బాబు హీరోగా వెంకట్ కళ్యాణ్ రూపొందిస్తున్న చిత్రం ‘జటాధర’. ప్రేరణ అరోరా నిర్మాత. తాజాగా ఈ మూవీ నిర్మాణ భాగస్వామ్యంలోకి జీ స్టూడియోస్ ఎంట్రీ ఇచ్చింది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ సినిమా అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు.
అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణా కథల్ని కూడా చూపించబోతోన్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. తెలుగు, హిందీ బై లింగ్విల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఫిబ్రవరిలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన సుధీర్ బాబు పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.