Gorre Puranam: గొర్రె పురాణం వినిపించాడనికి వస్తోన్న సుహాస్..రిలీజ్ డేట్ అనౌన్స్

Gorre Puranam: గొర్రె పురాణం వినిపించాడనికి వస్తోన్న సుహాస్..రిలీజ్ డేట్ అనౌన్స్

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్(Suhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ప్రారంభంలో షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసిన ఈ నటుడు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవలే అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్, శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం వంటి సినిమాలతో హిట్ అందుకున్న సుహాస్ మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ గొర్రె పురాణం(Gorre Puranam).

బాబీ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈ సినిమా నుండి ఇటీవలే టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.  తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 20 న విడుదల కామోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఒక ఊళ్ళో హిందూ ముస్లింల మధ్య ఒక గొర్రె ఎలా చిచ్చు పెట్టింది, ఆ గొడవలోకి సుహాస్ ఎలా వచ్చాడు అని ఆసక్తికర కథతో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో గొర్రెకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం. మరి మరో కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా సుహాస్ కు ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ప్రస్తుతం గొర్రె పురాణం సినిమా ప్రమోషన్స్ మేకర్స్ మొదలుపెట్టారు.

Also Read :- తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్

ప్రస్తుతం సుహాస్ మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) ప్రధాన పాత్రలో ఉప్పు కప్పురంబు అనే సినిమా చేస్తున్నాడు. ఐవీ శశి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రాధికా లావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒక మారుమూల గ్రామంలోని ఒక స్మశానాన్ని విస్తరించడం నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది అని ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్. త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.