అందుకే ప్రభాస్ అని పెట్టుకున్న.. ఎలా ఐనా ఫేమస్‌ అవ్వాలి

"నాకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే చాలా ఇష్టం అందుకే నా పేరులో ప్రభాస్ అని పెట్టుకున్నా" అంటున్నాడు సుమంత్ ప్రభాస్. ఆయన హీరోగా చేస్తూ, దర్శకతం వహిస్తున్న లేటెస్ట్ మూవీ "మేమ్ ఫేమస్‌". ఈ మూవీ మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు సుమంత్. ఇందులో భాగంగా మేమ్‌ ఫేమస్‌ సినిమా గురించి, తన లైఫ్ గురించి ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. 

 ‘‘నా పేరు సుమంత్‌ రెడ్డి. ప్రభాస్‌ గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. అందుకే సుమంత్‌ ప్రభాస్‌ అని పెట్టుకున్నా. డిగ్రీ పూర్తయ్యాక ఎస్‌ఐ ఉద్యోగానికి ప్రిపేర్‌ కావాలనుకున్నాను. కానీ కాలేజ్ లో చదువుకుంటున్న సమయంలో నా గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఒక షార్ట్‌ ఫిల్మ్‌ తీశాను. అది మంచి సక్సెస్ అయ్యింది. దాంతో, ఒక ఫిల్మ్‌ స్కూల్‌ వాళ్లు కంటెంట్‌ క్రియేట్‌ చేయమని కెమెరాలు స్పాన్సర్‌ చేయడంతో.. ‘పిల్ల పిల్లగాడు’ అనే వెబ్‌ సిరీస్‌ చేశాం. అది నచ్చడంతో అనురాగ్, శరత్‌ అన్న పిలిచి, వెబ్‌ సిరీస్‌ చేద్దామన్నారు. కానీ నేను సినిమా చేద్దామన్నాను. కథ రెడీ చేయమన్నారు. అలా ‘మేమ్‌ ఫేమస్‌’ సినిమా మొదలైంది.

 ఇది ఒక యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎలా అయినా ఫేమస్‌ అవ్వాలనుకునే కుర్రాల్ల కథే ఈ సినిమా. ఫుల్లుగా నవ్వుకుంటారు. నా తర్వాతి సినిమా కూడా చాయ్‌ బిస్కెట్‌ బ్యానర్‌లోనే ఉంటుంది’’ అని చెప్పుకొచ్చాడు సుమంత్ ప్రభాస్.