
అక్కినేని మనవడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన హీరో సుమంత్ తన కొత్త సినిమాని ప్రకటించాడు. వైవిధ్యభరితమైన కథలతో రావడం సుమంత్ కి..చాలా సినిమాలకి ప్లస్ పాయింట్ అయింది. మళ్ళీ అదే తరహాలో ఆడియాన్స్ ముందుకు వస్తున్నాడు. ఫ్యామిలీ డ్రామా జోనర్ లో ఓ సినిమాతో వచ్చేస్తున్నాడు. మరి ఆ సినిమా ఏంటీ? రిలీజ్ ఎప్పుడు? అనేది చూద్దాం.
సుమంత్ హీరోగా సన్నీ కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘అనగనగా..’ఈటీవీ విన్‌తో కలిసి కృషి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చాలా కాలంగా పెద్ద హిట్ కొట్టని సుమంత్.. ఈసారి నేరుగా ఓటీటీలో తన సత్తా చూపించబోతున్నాడు.
‘అనగనగా..’ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో మే 8 నుంచి స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ విజువల్స్ ఆసక్తిగా ఉన్నాయి. ఈ సినిమాలో సుమంత్ స్కూల్ మాస్టారుగా నటించనున్నాడు.
Also Read:-ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు హీరోయిన్లు.. ఫోటోలు వైరల్..
విద్యార్థులు తమ చదువును కొత్త పద్దతిలో నేర్చుకునేలా పాఠాలు చెప్పనున్నాడు సుమంత్. అందుకు ఓ మూడు టిప్స్ ను వారి ముందు ఉంచాడు. "రోజులో పది గంటలు ఒత్తిడిలో చదవడం కంటే, 3 గంటలు ఒత్తిడి లేకుండా చదవండి. అలాగే, నడవండి.. ఓ ఆట ఆడండి.. ఒత్తిడి తగ్గించుకోండి. కేవలం మార్కుల కోసం చదవకండి. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మార్కులు అవే వస్తాయి" అని సుమంత్ విద్యార్థులకు సూచించబోతున్నాడు.
Learning should be a joyful journey, not a stressful race. ✨📘#Anaganaga - A Win Original Film,
— ETV Win (@etvwin) April 14, 2025
Comming soon
only on @ETVWIN app.
Directed by Sunny Sanjay@isumanth @rakeshreddy1224 @pavan_pappula @arvindmule_pd @ashwinrajasheka @Sri_Avasarala @chvenkatesh78 @ThisisNitin1111… pic.twitter.com/736GBU580N
ఇందులో సుమంత్ కి జోడిగా 2024 బీహార్ మిస్ యూనివర్స్‌గా ఎంపికైన కాజల్ రాణి హీరోయిన్‌గా నటిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ విహర్ష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు ‘మహేంద్రగిరి వారాహి’అనే థ్రిల్లర్‌లో సుమంత్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.
#Anaganga from this Ugadi ✨🫶🏻@iSumanth @rakeshreddy1224
— KRISHI Entertainments (@krishient) February 22, 2025
@SunnySanjay1608 @etvwin
pic.twitter.com/yvY95D8sgQ