కండలు పెంచడం కాదు.. ముందు నటన నేర్చుకోండి

కండలు పెంచడం కాదు.. ముందు నటన నేర్చుకోండి

గత మూడేళ్ళుగా సరైన హిట్స్ లేక సతమతమైన బాలీవుడ్.. ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతోంది. షారుఖ్ ఖాన్ పఠాన్ తో మొదలైన ఈ హవా రీసెంట్ గా వచ్చిన గదర్2 వరకు కొసనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో హీరోలు మంచి కథలు సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకి రావాలి. కానీ బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఇంకా సిక్స్ ప్యాక్ బాడీలు చూపించడంపైనే ఫోకస్ పెడుతున్నారు.

తాజాగా ఇదే విషయంపై బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ హాట్ కామెంట్స్ చేశాడు. ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గదర్ 2. ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో సన్నీ డియోల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు బాడీ బిల్డింగ్ పైన కాదు.. నటనపై దృష్టి పెట్టాలి. మీరేమి బాడీ బిల్డర్స్ కాదు కదా కండలు పెంచడానికి. ఎవరి బాడీ అయినా ఫిట్ గా, హీల్తీగా ఉంటే చాలు. బాడీ బాగుందని కాదు.. బాగా నటిస్తారు అనే గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. కొత్త కొత్త కథలపై, నటనపై దృష్టి పెట్టండి అంటూ చెప్పుకొచ్చారు. సన్నీ డియోల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనంగా మారుతున్నాయి. మరి ఆయన చేసిన ఈ కామెట్స్ పై మిగతా హీరోలు, వారి అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.