Suriya Jyothika:18 ఏళ్ల తర్వాత జోడీగా సూర్య, జ్యోతిక.. తెరపై అద్భుతం చూపించనున్న లేడీ డైరెక్టర్!

Suriya Jyothika:18 ఏళ్ల తర్వాత జోడీగా సూర్య, జ్యోతిక.. తెరపై అద్భుతం చూపించనున్న లేడీ డైరెక్టర్!

టాలీవుడ్,కోలీవుడ్లో పదికి పైగా హీరో హీరోయిన్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వారున్నారు. అందులో ఒక చక్కని జంట ఎవరంటే..టక్కున గుర్తొచ్చేది..సూర్య(Suriya)..జ్యోతిక(Jyothika) అనే చెప్పుకోవాలి. వీరిద్దరూ నటనలోనూ, ఆహార్యంలోను, సామాజిక సేవ దృక్పథంలోనూ ఆదర్శంగా నిలిచారు.

1999లో విడుదలైన ‘పూవెల్లామ్‌ కేట్టుప్పార్‌’లో తొలిసారి ఈ జంట కలిసి నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ వరుసగా ఏడు సినిమాల్లో కలిసి నటించేలా సినీ జర్నీ సాగింది. ఇక సూర్య‌, జ్యోతికల పరిచయం ప్రేమగా మారడంతో.. 2006లో పెళ్లి చేసుకున్నారు. దీంతో వీరి కాంబోలో సినిమా పడలేదు. కాగా ఈజోడీ త్వరలో ఒకే మూవీలో నటిస్తున్నట్లు టాక్. వివరాల్లోకి వెళితే.. 

కంగువ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. తెలుగుపై కూడా సూర్య చాలా ఫోకస్ పెట్టారు. తెలుగు వెర్షన్ కోసం ప్రమోషన్లను ఎక్కువగానే చేస్తున్నారు. ఈ క్రమంలో సూర్య, జ్యోతిక కలిసి జంటగా ఓ సినిమా చేస్తే బాగుంటుందని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో హీరో సూర్యని అడిగితే, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Also Read :-  టాలీవుడ్ స్టార్ హీరోలపై సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

“నా భార్యతో కలిసి నటించడం నాకూ చాలా ఇష్టంగానే ఉంది. తుది నిర్ణయం అనేది దర్శక నిర్మాతల మీద ఆధారపడి ఉంటుంది. కథ డిమాండ్ చేస్తే తప్పకుండా కలిసి నటిస్తాం. సినిమా అనేది ఆర్గానిక్ వేలో ఉండాలి. కావాలని నటించేలా చేసినట్లు ఉండకూడదు. రీమేక్ సినిమానా? కొత్త కథా? అనేది ముఖ్యం కాదు. ఇద్దరికి సరిపోయే కథ అయితే చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు” అని సూర్య చెప్పుకొచ్చారు. అలాగే, తాను సినీ ఇండస్ట్రీలో విజయం సాధిస్తున్నాను అంటే.. తన భార్య జ్యోతిక అని తెలిపారు. ఇక నా జీవితంలో నేను నేర్చుకున్నదంతా ఆమె నుంచే అని.. నేను వరుస సినిమాల్లో బిజీగా ఉంటే తానే మా పిల్లలకి తల్లి తండ్రై నిలిచిందని చెప్పారు. జ్యోతిక లేకపోతే నేను లేనని.. అన్నీ సెట్ అయితే త్వరలోనే మంచి సినిమాలో నటిస్తామని ఈ సందర్బంగా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.   

సినీ వర్గాల సమాచారం ప్రకారం.. బ్లాక్ బాస్టర్ బెంగుళూరు డేస్‌ ఫేమ్‌ అంజలి మేనన్‌ డైరెక్షన్ లో సూర్య‌, జ్యోతికలు కలిసి ఓ మూవీ చేయనున్నారట. ప్రస్తుతం ఈ జోడీని స్క్రీన్ పై చూపించడానికి మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ అందమైన జంట కాంబోపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఇదే కనుక నిజమైతే దాదాపు 18 ఏళ్ల తరువాత సూర్య, జ్యోతిక మరోసారి వెండితెరపై.. కలిసి ప్రేమ పాఠాన్ని అభిమానులకి చెప్పే సమయం అతి దగ్గర్లోనే ఉంది.  

ప్రస్తుతం వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే..జ్యోతిక రీసెంట్ గా అజయ్ దేవగన్ తో నటించిన షైతాన్, మలయాళ స్టార్ మమ్ముట్టి తో కాదల్ ది కోర్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకున్నాయి. అలాగే కొన్ని సినిమాల్లో నటిస్తూనే..మంచి కంటెంట్ ఉన్న సినిమాలని నిర్మిస్తోంది. సూర్య ప్రస్తుతం కంగువ రిలీజ్ కు ఉండగా.. అలాగే రీసెంట్ రైటర్, డైరెక్టర్ కార్తీక్‌ సుబ్బరాజుతో సూర్య 44వ సినిమా షూట్ కూడా కంప్లీట్ చేసుకుంది.