Suriya: టాలీవుడ్ స్టార్ హీరోలపై సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్​.. ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ ఏం చెప్పారంటే..

Suriya: టాలీవుడ్ స్టార్ హీరోలపై సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్​.. ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ ఏం చెప్పారంటే..

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ఆకట్టుకునే సూర్య (Suriya).. ప్రస్తుతం కంగువ (Kanguva) అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. శివ(Shiva) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌‌‌‌‌‌‌‌, టీజర్, ట్రైలర్ విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా వచ్చేనెల నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో కంగువ మేకర్స్ వరుస ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు.

ఇటీవలే ముంబై, న్యూ ఢిల్లీలో ఫ్యాన్స్ తో సూర్య సందడి చేశారు. ఈ క్రమంలో కంగువ టీమ్ తెలుగు ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉన్నారు.   ఆదివారం అక్టోబర్ 28న వైజాగ్‍లో కంగువ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ భారీస్థాయిలో నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో సూర్య, బాబీ దేవోల్‌, దేవిశ్రీ ప్రసాద్‌, హీరో సందీప్ కిషన్ తో సహా పలువురు సెలెబ్రేటిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోల గురించి సూర్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టాలీవుడ్ లో పెద్ద హీరోలు చాలామంది ఉన్నారని, అందులో కొందరి పేర్లు చెబితే వారిలో ఏం నచ్చిందో చెప్పాలని సూర్యను డైరెక్టర్ శివ అడిగారు. ముందుగా ప్రభాస్ పేరు చెప్పారు శివ. “ప్రభాస్.. డార్లింగ్, స్వీట్ హార్ట్” అని సూర్య అన్నారు. మిర్చి చిత్రంలోని కటౌట్ చూసి కొన్నికొన్ని నమ్మేయాలి డ్యూడ్ డైలాగ్ చెప్పారు. ఏదైనా చేయగలరని ప్రజలను ప్రభాస్ నమ్మించగలని సూర్య అన్నారు. ప్రభాస్‌తో మల్టీస్టారర్‌ చేస్తే, కచ్చితంగా యాక్షన్‌ జానర్‌లోనే చేస్తానని.. రీసెంట్ ప్రభాస్ ఫిల్మ్ కల్కి అద్భుతంగా ఉందని, కల్కి 2 కోసం వేచిచూస్తున్నానని సూర్య చెప్పుకొచ్చారు. 

సూపర్ స్టార్ మహేష్‌ బాబు గురించి చెప్పుకొస్తూ.. 'స్కూల్లో మహేష్ బాబు నాకు జూనియర్‌. మహేష్, తాను కలిసి స్కూల్‍కు వెళ్లామని సూర్య చెప్పారు. ఆయన స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బాగుంటుంది. ఎమోషన్స్‌ బాగా చూపిస్తారు' అని ప్రశసంలు కురిపించారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చెబుతూ.. "తారక్​ తెలుగు మాట్లాడే విధానం ఆకట్టుకుంటుంది. చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఆ విషయం నన్నెంతో ఆకట్టుకుంటుంది. ఆయనలా స్వచ్ఛంగా తెలుగులో ఎవరూ మాట్లాడలేరని.. ఇక తానెప్పుడూ తారక్ ఎనర్జీతో ఆశ్చర్యపోతానని చెప్పారు. ఇతర ఇండస్ట్రీ జనాలు కూడా ఎన్టీఆర్‌కు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందని ఆలోస్తుంటారని" సూర్య అన్నారు.

అల్లు అర్జున్ గురించి చెబుతూ.. " అల్లు అర్జున్ పడే కష్టం, డ్యాన్స్‌కు తాను పెద్ద ఫ్యాన్ అని సూర్య చెప్పారు. పుష్ప 2 కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి అల్లు అరవింద్‌ కూడా ఓ కారణం. తెలుగులో గజినీ చిత్రాన్ని అల్లు అరవింద్ రిలీజ్ చేసినందుకు చాలా హ్యాపీ అన్నారు. 

అలాగే డైరెక్టర్ శివ గురించి చెప్పమని అడగగా.. 'రామ్‍చరణ్ చేసిన 15 సినిమాల్లోనే గ్లోబల్ స్టార్ అయ్యారని, తనకు సోదరుడి లాంటి వారని సూర్య చెప్పారు. చరణ్ తో తనకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయని, తన సినిమాలు చూసి ఫోన్‌ చేసి ప్రశంసిస్తారని సూర్య గుర్తు చేసుకున్నారు. రామ్‌ చరణ్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలనుందని మనసులో మాటను ఈ సందర్బంగా సూర్య బయటపెట్టారు. తనకు చెన్నైలో ఓ ఎన్‍జీవో (NGO) ఉందని, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్ఫూర్తితోనే తాను అది మొదలుపెట్టానని సూర్య గుర్తుచేసుకున్నారు.

కంగువ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిషా పఠాని హీరోయిన్గా నటిస్తోంది. 3Dలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు..రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పది భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రీడీలో కూడా విడుదల చేస్తున్నారు.