
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న సూర్య.. డిఫరెంట్ కాన్సెప్టులు సెలెక్ట్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇక్కడ ఆయనకున్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పలుమార్లు స్ట్రెయిట్ తెలుగు మూవీ చేయాలనుందని చెప్పాడు. కొన్ని ప్రయత్నాలు జరుగగా ఏదీ వర్కవుట్ కాలేదు.
ఇప్పుడు మాత్రం వరుసగా తెలుగు దర్శకులతో చర్చలు జరుపుతున్నాడు సూర్య. ధనుష్‌తో ‘సార్’, దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ వంటి హిట్ మూవీస్ రూపొందించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటించనున్నాడట. ఇప్పటికే సూర్యకు కథను వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో ధనుష్ కూడా కీలక పాత్ర పోషించనున్నాడని టాక్ వినిపిస్తోంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది. సూర్య 46వ సినిమాగా ఇది రూపొందనుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నాడు. మరోవైపు చందూ మొండేటితోనూ సూర్య స్టోరీ డిస్కస్ చేశాడట. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్‌తో ఓ చిత్రంతో పాటు, ఆర్జే బాలాజీ దర్శకత్వంలోనూ సూర్య ఓ సినిమా చేస్తున్నాడు.