తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) ప్రస్తుతం పుత్రోత్సాహని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన కుమారుడు దేవ్(Dev) కరాటేలో బ్లాక్ బెల్ట్ సాదించాడు. ఇప్పటికే పలు జాతీయ స్థాయిలో కరాటే పోటీల్లో అదరగొట్టిన దేవ్.. తాజాగా బ్లాక్ బెల్డ్ సాధించి సత్తా చాటాడు. ఇక కొడుకు సాధించిన ఘనత చూసి ఉప్పోంగిపోయాడట తండ్రి సూర్య. దీనికి సంబందించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో కొడుకు సాధించిన విజయం పట్ల సూర్య ఆనందం ఆయన కళ్ళల్లో క్లియర్గా కనిపించింది. కొడుకు భుజంపై గర్వంగా చేయి వేసి ఫోటోలకు పోజులు ఇచ్చారు సూర్య. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్.. హీరో సూర్యకి, ఆయన కుమారుడు దేవ్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Proud Father Moment🫶❤️🩹#Suriya's son Dev got Black Belt holding in Karate🥋🔥pic.twitter.com/QuxwWz3877
— AmuthaBharathi (@CinemaWithAB) April 21, 2024
ఇక హీరో సూర్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుడు శివతో పాన్ వరల్డ్ మూవీగా కంగువా చేస్తున్నాడు. 3Dలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12 భాషల్లో విడుదల కానుంది. బాలీవుడ్ బ్యూటీ దిశా పఠాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ఆడియన్స్ మెస్మరైజ్ చేసింది. ఒక్కో షాట్, ఒక్కో విజువల్ నెక్స్ట్ లెవల్లో ఉండటంతో ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాదిస్తుందో చూడాలి.