సూర్య ఈటీ మూవీ రివ్యూ

సూర్య ఈటీ మూవీ రివ్యూ

రన్ టైమ్ : 2 గంటల 30 నిమిషాలు
నటీనటులు: సూర్య,ప్రియాంక మోహన్,సత్యరాజ్,శరణ్య,వినయ్ రాయ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: రత్నవేలు
మ్యూజిక్: ఇమాన్
నిర్మాతలు : ఏషియన్ పిక్చర్స్,సన్ నెట్ వర్క్స్
రచన,దర్శకత్వం: పాండిరాజ్
రిలీజ్ డేట్: మార్చి 10,2022
కథేంటి?
ఓ ఊళ్లో లాయర్ గా పనిచేస్తుంటాడు కృష్ణ మోహన్ (సూర్య). పక్క ఊళ్లో రాజకీయ బలంతో అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ల జీవితాలతో ఆడుకుంటాడు కామేష్ (వినయ్ రాయ్). బాధితుల గురించి తెలిసి లాయర్ గా కృష్ణ మోహన్ ఏం చేశాడు..? ఎలాంటి హెల్ప్ చేశాడు..? ఈ ప్రయత్నంలో లాయర్ కృష్ణ మోహన్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు ..? కామేష్ కు ఎలా బుద్ది చెప్పాడు అనేది బ్రీఫ్ గా స్టోరి.
నటీనటుల పర్ఫార్మెన్స్: 
హీరో సూర్య తన అప్పియరెన్స్ లుక్స్ ,మేనరిజమ్స్ తో పాత్రకే వన్నె తెచ్చాడు. కమర్షియల్ హీరోగా ఫైట్లు, నటనతో రాణించాడు. హీరోయిన్ గా నటించిన ప్రియాంక మోహన్ చూడాటానికి చాలా అందంగా ఉంది. నటన తో కూడా మెప్పించింది. సత్యరాజ్ ,శరణ్యలు బాగా చేశారు. విలన్ గా చేసిన వినయ్ రాయ్ తన పాత్రలో జీవించాడుడు.
టెక్నికల్ వర్క్: 
ఇమాన్ మ్యూజిక్ లో పాటలు వినసొంపుగా లేవు.. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ  చాలా రిచ్ గా ఉంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ ను అందంగా తెరకెక్కించాడు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది. డైలాగులు ఓకే. 
విశ్లేషణ:
‘ఈటీ’’ రెగ్యులర్ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్. దానికి కొత్తగా వుమెన్ ట్రాఫికింగ్ ను జోడించారు. ఈ పాయింట్ కూడా ఈ మధ్య చాలా సినిమాల్లో చూపించినదే. పాండిరాజ్ ఇంతకుముందు డిఫరెంట్ సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇలాంటి నాసిరకం సినిమా తననుండి ఎక్స్ పెక్ట్ చేయలేం. కామెడీ ఓవర్ డోస్ అయినట్లు కనిపిస్తుంది. కథతో సంబంధం లేకుండా అరవ కామెడీ తమిళంలో వర్క్ అవుట్ అవుతుందేమో కానీ తెలుగులో చిరాకనిపిస్తుంది.  కామెడీ ఓవర్ డోస్ వల్ల కథ గాడి తప్పింది. ఫస్టాఫ్ లో సంబంధం లేని కామెడీ తో విసిగిస్తే..సెకండాఫ్ లో ఓవర్ డోస్ ఎమోషన్ ను పండించి బోర్ కొట్టించాడు. పాయింట్ మంచిదే అయినా..రాసుకున్న స్క్రీన్ ప్లే, రోత కామెడీ వల్ల మిస్ ఫైర్ అయినట్లు అనిపిస్తుంది. ఓవరాల్ గా ‘‘ఆకాశమే నీ హద్దురా’’, జై భీమ్ సినిమాలు ఓటీటీ లల్లో రిలీజ్ చేసి మంచి పేరు తెచ్చుకున్న సూర్య ఇలాంటి కథ ఎంచుకొని నిరాశపరిచాడు. 

బాటమ్ లైన్: ఎవరి తలకెక్కదు

 

ఇవి కూడా చదవండి

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్