తేజ సజ్జ(Teja Sajja).. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా ఈ హీరో కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. హనుమాన్(HanuMan) మూవీ బ్లాక్ బస్టర్ తో ఈ హీరో క్రేజ్ కూడా నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. అందుకే.. ఈ హీరో చేస్తున్న తరువాతి సినిమాలపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. అయితే హనుమాన్ సినిమా రిలీజై దాదాపు మూడు నెలలు గడుస్తున్నా తరువాతి సినిమాను ప్రకటించలేదు ఈ హీరో. కానీ, ఆయన ఫ్యాన్స్ మాత్రం ఆ గుడ్ న్యూస్ హనుమాన్ తరువాత ఎలాంటి సినిమా చేయనున్నాడు అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే తేజ సజ్జ నెక్స్ట్ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఇటీవలే ఈగల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని(Karthik Gattamaneni)తో తేజ సజ్జ నెక్స్ట్ సినిమా చేయనున్నాడట. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ ప్రాజెక్టు కు సంబందించిన కథా చర్చలు కూడా ఇప్పటికే జరిగాయని సమాచారం. ఇక ఈ సినిమాకు మిరాయ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా నిర్మించనుందట.
అయితే.. ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.40 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడానికి సిద్దమవుతున్నారట. ఇది తెలిసిన నెటిజన్స్ షాకవుతున్నారు. నిన్నమొన్నతవరకు కోటి, రెండు కోట్లలో సినిమాలు చేసిన తేజ.. హనుమాన్ సక్సెస్ తో ఏకంగా రూ.40 కోట్ల రేంజ్ కి చేరిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా హిట్ అయింది అంటే తేజ సజ్జను ఆపడం ఎవరి తరం కాదనడంలో ఎలాంటి సందేహం లేదు.