Pareshan Review: ‘పరేషాన్‌’ మూవీ రివ్యూ.. రిజల్ట్ ఏంటి?

Pareshan Review: ‘పరేషాన్‌’ మూవీ రివ్యూ.. రిజల్ట్ ఏంటి?

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి(Rana daggubati) సమర్పణలో తిరువీర్‌(Thiruveer), పావని కరణం(Pavani karanam) ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం పరేషాన్(Pareshan). రూపక్ రోనాల్డ్సన్(Roopak ronldsan)  దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బన్నీ అభిరన్‌, సాయి ప్రసన్న, అర్జున్‌ కృష్ణ, మురళీధర్‌ గౌడ్‌ ఇతర పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా జూన్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ ను ఏమేరకు మెప్పించ్చింది అనేది ఇప్పుడు తెల్సుకుందాం. 

కథ: క్రైస్తవుడైన సమర్పణ్‌(మురళీధర్‌ గౌడ్‌) ఓ సింగరేణి ఉద్యోగి. అతని కొడుకు ఐజాక్‌ (తిరువీర్‌) ఒక జాబ్ లెస్ గాయ్.ఊర్లో ఆవారాగా తిరుగుతుంటాడు. కొడుకును దారిలో పెట్టేందుకు తన ఉద్యోగాన్ని అతనికి అప్పజెప్పాలనుకుంటాడు సమర్పణ్‌. ఇందుకోసం అధికారులకు రెండు లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాల్సి వస్తోంది. కానీ ఆ డబ్బు ఎవరో కొట్టేస్తారు. దీంతో ఐజాక్ విచిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కకుంటాడు. ఇంతకీ ఆ డబ్బు  అధికారులకు ఇచ్చాడా? మధ్యలో ఐజాక్ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? ఆ డబ్బు ఎవరు కొట్టేశారు అనేది మిగిలిన కథ.  

ఎలా ఉంది: ఈ మధ్య చాలా సినిమాల్లో తెలంగాణ కల్చర్‌ ఎక్కువగా కనిపిస్తోంది. ఆ సినిమాలు కూడా ప్రేక్షకులు బాగానే ఆకట్టుకున్నాయి కూడా. ఇక పరేషాన్‌ కూడా అదే కోవలోకి వస్తుంది. మంచిర్యాలకు చెందిన ఐదుగురు సింగరేణి పోరగాళ్ల కథే పరేషాన్. తెలంగాణ నేటివీటీతో చాలా సహజంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే.. సినిమాలో ప్రతీ సన్నివేశం వినోదాత్మకంగా ఉన్నా.. కథలో మాత్రం కొత్తదనం కనిపించలేదు. ఇలాంటి కంఫ్యూజన్ కామెడీ డ్రామాలు ఇప్పటికి చాలానే వచ్చాయి కానీ.. ఈ సినిమాలో తెలంగాణ నేటివిటీని జోడించారు అంతే. కథ కూడా సింపుల్‌గా, ఎలాంటి ట్విస్టులు లేకుండా సాగుతుంది. ఎమోషనల్‌ సీన్స్‌ అంతగా వర్కౌట్‌ కాలేదు. ఇక ఎలాంటి అంచానాలు లేకుండా థియేటర్స్‌కు వస్తే మాత్రం ‘పరేషాన్‌’ కాస్త మెప్పిస్తుంది.

ఎలా చేశారు: సినిమాలో తిరువీర్‌ నటన చాలా బాగుంది. తన సహజమైన, అమాయకమైన నటనతో మెప్పించాడు. శిరీష పాత్రలో పావని కరణం చక్కగా నటించింది. ఇక అర్జున్‌ కృష్ణ, రవి, బన్ని అభిరామ్‌ కూడా తమ పాత్ర మేరకు బాగా నటించారు. యశ్వంత్‌ నాగ్‌ సంగీతం కూడా సో సో గానే ఉంది. ఇక ఇక్కడ ,ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాసు పెండమ్‌ సినిమాటోగ్రఫి గురించి. తెలంగాణ పల్లె అందాలను అద్భుతంగా తెరపై చూపించాడు. ఎడిటర్ పర్వాలేదు. చాలా సీన్స్ ఇంకా షార్ప్ గా కట్ చేయొచ్చు.

ఇక మొత్తంగా పరేషాన్ మూవీ గురించి చెప్పాలంటే. ఇది ఒక ఓట్ డేటెడ్ రొటీన్ కన్ఫ్యూజన్ కామెడీ డ్రామా.