మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ (Tovino Thomas) రియలిస్టిక్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తో ప్రేక్షకులకు సుపరిచితం. మలయాళ డబ్బింగ్ మూవీ స్ అయినా ‘మిన్నల్ మురళి’, 2018,అన్వేషిప్పిన్ కండేతుమ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
ఇప్పుడాయన నుంచి రానున్న పాన్ ఇండియా సినిమా 'ఆర్మ్' (ARM) ‘అజాయంతే రంధం మోషణమ్". టోవినో థామస్ 50వ మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. డెబ్యుటెంట్ డైరెక్టర్ జితిన్ లాల్ తెరకెక్కించిన ఈ సినిమాని టాలీవుడ్ బడా బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ నెల (సెప్టెంబర్ 12న) తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
Also Read:-బిగ్‌బాస్ సీజన్-8 ఫస్ట్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్
ఈ సందర్బంగా ఆర్మ్ రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టొవినో థామస్ పలు సినీ విశేషాలు పంచుకున్నారు. తాను చూసిన మొదటి తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవి గారిదే అని థామస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గారి 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా చూసి ఎంజాయ్ చేశానని తెలిపారు.
ఇక ‘A.R.M ’ సినిమా గురించి మాట్లాడుతూ..ARM అంటే..'అజాయంతే రంధం మోషణమ్' అనగా..అజయన్ రెండో దొంగతనం అని దీనికి అర్థం అని చెప్పారు. అలాగే ఇది తన కెరీర్ మైల్ స్టోన్ మూవీ '50వ' సినిమాగా అవుతుందని తెలీదు అన్నారు. ARM చాలా ఎగ్జయిటింగ్ స్క్రిప్ట్. మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం హ్యుజ్ ఛాలెంజ్. డైరెక్టర్ నాపై నమ్మకం ఉంచారని చెప్పారు.
ఇంత పెద్ద సినిమాకి డెబ్యుటెంట్ డైరెక్టర్ జితిన్ లాల్‌పై నమ్మకం ఉంచడంపై? అని అడగగా..డైరెక్టర్ జితిన్ లాల్ నేను ఎనిమిదేళ్లుగా కలిసి ప్రయాణం చేస్తున్నారం. తను చెప్పిన స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది. నా కెరీర్ లో 80శాతం సినిమాలు కొత్త దర్శకులతోనే చేశాను. పరస్పర నమ్మకంతోనే ఇది సాధ్యపడుతుంది. అలాగే ఈ సినిమాని ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లోనూ విడుదల చేయనున్నాం. అలాగే దాదాపు 30 భాషల్లో సబ్‌టైటిల్స్ వేస్తున్నాం అని టొవినో థామస్ వెల్లడించారు.