ప్లీజ్ డేట్స్ ఇవ్వండి అమ్మా.. కీర్తి సురేష్ కోసం వరుణ్ రిక్వెస్ట్

ప్లీజ్ డేట్స్ ఇవ్వండి అమ్మా.. కీర్తి సురేష్ కోసం వరుణ్ రిక్వెస్ట్

కీర్తి సురేష్(Keerthi Suresh).. ప్రస్తుతం ఉన్న సౌత్ హీరోయిన్స్ లో ఒకరు. మహానటి సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆమె.. ఆతరువాత మాత్రం ఆ సక్సెస్ ను కంటిన్యూ చేయలేకపోయింది. ఆ తరువాత ఆమె చేసిన సినిమాలేవి అంతగా ఆడలేదు. వరుస ప్లాప్స్ పలకరించాయి. ఇటీవల ఆమె నటించిన భోళా శంకర్ సినిమా కూడా ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవికి నటించారు కీర్తి సురేష్. అయినప్పటికి అవకాశాలు మాత్రం గట్టిగానే వస్తున్నాయి ఈ అమ్మడుకు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో బాలీవుడ్ సినిమా కూడా ఉంది.

అవును తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ నిర్మాతగా బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్(Varun Dhawan) హీరోగా వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కలీస్ దర్శకత్వం వశిస్తున్నాడు. తమిళంలో విజయ్ తలపతి హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ తేరీకి ఇది రీమేక్. ఇటీవలే లాంఛనంగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 

అయితే ఈ సినిమాకు కీర్తి డేట్స్ అడ్జెస్ట్మెంట్ అవడం లేదట. కారణం ప్రస్తుతం ఆమె వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటమే. దీంతో ఈ సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతుందట కీర్తి. దీంతో హీరో వరుణ్ కీర్తిని రిక్వెస్ట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇటీవల కీర్తి న్యూ బిగిన్స్ అండ్ యెల్లో అంటూ ఒక పోస్ట్ పెట్టారు. దానికి స్పందించిన వరుణ్ దయచేసి డేట్స్ ఇవ్వండి అమ్మా అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.