
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ హాట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకి గెస్ట్ గా వచ్చాడు. ఈ క్రమంలో వెంకటేష్ బాలయ్యతో కలసి ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాల్ని అభిమానులతో పంచుకున్నాడు. అయితే హీరో వెంకటేష్ క్రికెటర్ అనే విష్యం అందరికి తెలిసిందే. దీంతో హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే చాలు తప్పకుండా వెళ్లి చూస్తుంటాడు. అంతేకాదు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ తరుపున జరిగే సీసీఎల్ (సినీ క్రికెట్ లీగ్) లో కూడా ఆడుతూ సిక్సర్లు బాదుతూ ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటాడు.
అయితే అన్‌స్టాపబుల్ షోలో క్రికెట్ గురించి ఆసక్తికర విషయాల్ని తెలియజేశాడు. ఇందులోభాగంగా తన ఫెవెరెట్ క్రికెటర్ భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అని తెలిపాడు. అయితే ధోనీ ఆట, ప్రవర్తన, నాయకేతవ లక్షణాలు ఇవన్నీ కూడా తనకి ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. అలాగే 2011 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఎమ్మెస్ ధోనీతోపాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ని ఓ మీటింగ్ లో కలిశానని ఆ సమయంలో జరిగిన ఇన్సిడెంట్స్, కన్వర్శేషన్ ఇప్పటికీ బాగా గుర్తున్నాయని తెలిపాడు. ఇక ధోనీ ప్రభావం ఇప్పటికీ చాలామంది ఆటగాళ్లపై ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ ఎపిసోడ్ ప్రముఖ ఓటిటి అయిన ఆహాలో ప్రసారం అవుతోంది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హీరో వెంకటేష్ తెలుగులో ప్రముఖ డైరెక్టర్ అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది.