టాలీవుడ్ స్టార్ హీరో విక్టరి వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఎలాంటి బజ్ లేకుండా, టికెట్ ధరలు పెంచకున్నప్పటికీ సులువుగా రూ.230 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. ఇప్పటికీ మంచి అక్యుపెన్సీతో థియేటర్స్ లో రన్ అవుతోంది. అయితే ఇటీవలే హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలసి సక్సెస్ మీట్ లో పాల్గొన్నాడు. ఇందులోభాగంగా కొందరు రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాడు.
ఈ క్రమంలో ఓ రిపోర్టర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని కొన్ని సన్నివేశాలని గుర్తు చేస్తూ ఓటిటిలు చూస్తే కిడ్స్ పాడవుతున్నారని చెప్పిన మీరే రానా నాయుడు వెబ్ సీరీస్ లో అలా చూపించారు అంటూ ప్రశ్నించాడు. అలాగే మీ వెబ్ సీరీస్ చూసి పాడవ్వలేదా అని అడిగాడు. దీంతో వెంకటేష్ స్పందిస్తూ రానా నాయుడు వెబ్ సీరీస్ లో తాను కేవలం తన జాబ్ పర్ఫెక్ట్ గా చేశానని కానీ సెకెండ్ సీజన్ లో కొన్ని మార్పులు, చేర్పులు చేశామని తెలిపాడు. ఈక్రమంలో రెండో సీజన్ లో లాంగ్వేజ్, డైలాగులు, సన్నివేశాలు ఇలా అన్నీ మార్చామని తెలిపాడు. దీన్నిబట్టి చూస్తే రానా నాయుడు రెండో సీజన్ లో అడల్ట్ కంటెంట్, వల్గర్ లాంగ్వేజ్ వంటివి ఉండవని తెలుస్తోంది.
అయితే మీర్జాపూర్ వెం సీరీస్ లో కూడా మొదట్లో ఇలాంటి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో 3వ సీజన్ అడల్ట్ కంటెంట్, వల్గర్ లాంగ్వేజ్ వంటివి లేకుండా తెరకెక్కించారు. దీంతో 3వ సీజన్ కి పెద్దగా రెస్పాన్స్ రాక క్లిక్ కాలేదు. మరి రానా నాయుడికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. అయితే రానా నాయుడు రెండో సీజన్ మొడటి హాఫ్ ఆగస్టు లేదా సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.