Arjun Daggubati: హీరో వెంకటేష్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..?

Arjun Daggubati: హీరో వెంకటేష్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..?

Arjun Daggubati: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకి ప్రముఖ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గెస్ట్ గా వచ్చి సందడి చేశాడు. ఈ ఎపిసోడ్ శుక్రవారం రిలీజ్ అయ్యింది. అయితే ఈ షోలో బాలయ్య, వెంకీమామ జోక్స్ వేస్తూ, అల్లరి చేస్తూ ఆడియన్స్ ని అలరించారు. 

ఇందులో వెంకటేష్ తన తనయుడు అర్జున్ దగ్గుబాటి సినీ ఇండస్ట్రీ ఎంట్రీపై స్పందించాడు. ఇందులోభాగంగా అర్జున్ దగ్గుబాటి ఖచ్చితంగా ఇండస్ట్రీకి వస్తాడని స్పష్టం చేశాడు. ప్రస్తుతం పలు మెళుకువలు నేర్చుకుంటూ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడని తెలిపాడు. అర్జున్ కి  సినిమాలంటే చాలా ఇష్టమని దాంతో ఇండస్ట్రీకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాడని చెప్పుకొచ్చాడు. అయితే అర్జున్ హీరోగా ఎంట్రీ ఇస్తాడా లేదా డైరెక్షన్ విభాగంలో సెటిల్ అవుతాడా అనే విషయంపై మాత్రం వెంకటేష్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో వెంకటేష్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

Also Read :- ఓవర్సీస్ లో మొదలైన తెలుగు సినిమాల జాతర

అయితే ఇప్పటివరకూ దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి దాదాపుగా 5మంది ఇండస్ట్రీకి వచ్చారు. ఇందులో దగ్గుబాటి రామానాయుడు వారసులలోని వెంకటేష్ హీరో కాగా, పెద్ద కొడుకు సురేష్ బాబు ప్రొడ్యూసర్ గా సెటిల్ అయ్యాడు. ఇక సురేష్ బాబు ఇద్దరు కొడుకులు రానా, అభిరామ్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. 

రానా సోలో హీరోగా మాత్రమేకాకుండా మల్టీస్టారర్ సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అభిరామ్ కూడా "అహింస" అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. మరి వెంకటేష్ కొడుకు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చి తన తండ్రి నటన వారసత్వాన్ని కొనసాగిస్తాడో లేక తాత మాదిరిగా ప్రొడ్యూసర్ అవుతాడో చూడాలి. 

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం వెంకటేష్ ప్రముఖ డైరెక్టర్ అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమానుంచి రిలీజ్ అయిన 'గోదారి గట్టు మీద రామ చిలుకవే" అనే సాంగ్ యూయూట్యుబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో వెంకటేష్ కి జంటగా ప్రముఖ హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. జనవరి 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది.