మ్యూజికల్ ట్రీట్‌తో సంక్రాంతికి వస్తున్నాం..

వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్‌‌గా నిలిచి సినిమాపై  బజ్ క్రియేట్ చేశాయి. 

తాజాగా నిర్వహించిన  మ్యూజికల్ నైట్ ఈవెంట్‌‌లో వెంకటేష్  ‘బ్లాక్ బస్టర్ పొంగల్’ సాంగ్ పాడటం అందరినీ ఉర్రూతలూగించింది. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ‘ఇది నా 76వ సినిమా. అనిల్ వండర్‌‌‌‌ఫుల్ స్క్రిప్ట్‌‌తో వచ్చారు. తప్పకుండా  అందరికీ బాగా నచ్చుతుంది.  నా అభిమానులు ఇలాంటి సినిమాలని చాలా ఇష్టపడతారు. సంక్రాంతికి మంచి సినిమాతో వస్తున్నాం. 

అందరూ ఫ్యామిలీతో  ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది’ అని చెప్పారు. ఈ చిత్రం మ్యూజికల్ ట్రీట్‌‌లా ఉంటుందని హీరోయిన్స్ మీనాక్షి, ఐశ్వర్య అన్నారు.  అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి సినిమాకి హైప్ తీసుకొచ్చారు. గోదారి గట్టు సాంగ్ 90 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ పాట రాసిన భాస్కర్ భట్ల గారికి, సింగర్ రమణ గోగుల గారికి, మిగతా సింగర్స్‌‌కి, ముఖ్యంగా వెంకీ గారికి థాంక్ యూ. 

అలాగే మిగతా పాటలకు కూడా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరికీ మెమొరబుల్ సంక్రాంతి అవుతుంది’ అని చెప్పాడు.  మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ ‘వెంకటేష్ గారి మూవీకి ఫస్ట్ టైం మ్యూజిక్ ఇవ్వడం హ్యాపీగా ఉంది.  ఇందులో పాటలు రాసిన లిరిక్ రైటర్స్‌‌కి, సింగర్స్ అందరికీ థాంక్ యూ. గోదారి గట్టు పాట టాప్ 2 లో ఉంది. 

పాటలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని చెప్పాడు. అనిల్ ఈ చిత్రాన్ని హెల్తీగా, అందరూ ఎంజాయ్ చేసేలా తీర్చిదిద్దారని నిర్మాత దిల్ రాజు చెప్పారు. నటులు వీటీ గణేష్, ఉపేంద్ర లిమాయే,  డిఓపి సమీర్ రెడ్డి, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాష్, లిరిక్ రైటర్స్ రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల,  సింగర్ రమణ గోగుల తదితరులు పాల్గొన్నారు.