Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ మళ్లీ మార్కెట్లోకి వచ్చింది. చిన్న బ్యాటరీ వేరియంట్ అయిన Vida V1 Plus ని హీరో కంపెనీ తిరిగి రీ ఇంట్రడ్యూస్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,45,000(inc, FAME 2 సబ్సిడీ కలిపి ) ఉండగా ఈ స్కూటర్ ను 30వేల భారీ తగ్గింపుతో అందిస్తున్నారు. తగ్గింపు తర్వాత ఈ స్కూటర్ ధర రూ. 1,15,000. రాష్ట్రాలను బట్టి ధరలు మారుతుంటాయి. ఢిల్లీ, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన కస్టమర్లు రాష్ట్ర సబ్సిడీ మరో రూ. 20 వేల పొందుతారు.
Hero Vida V1 Plus అనేది Vida V1 స్కూటర్ లైనప్ బేస్ వేరియంట్. ఇందులో Vida V1 ప్రో కూడా ఉంది.రెండింటి మధ్య వ్యత్యాసం బ్యాటరీ సామర్థ్యం, పరిధి, ఫీచర్లు. Vida V1 Plus 3.44kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు వస్తుంది. V1 ప్రో అయితే 3.94kWh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 110 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.
పవర్ ట్రెయిన్ విషయానికొస్తే V1 ప్లస్ 6kW, 25Nm గరిష్ట శక్తిని, 3.9kw నిరంతర శక్తిని V1 ప్రో వలె అదే పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనెస్ మోటార్ (PMSM) ద్వారా అందించబడుతుంది. ఈ-స్కటర్ గరిష్టంగా 80 kmph వేగాన్ని అందిస్తుంది.
ALSO READ :- HBD SreeVishnu: కొంచం గ్యాప్ ఇవ్వు అన్నా: ఒకటి కాదు ఏకంగా మూడు
ఫీచర్ల విషయానికొస్తే ఈ రెండు స్కూటర్లు ఒకే 7 అంగుళాల TFT డిస్ ప్లేను కలిగి ఉంటాయి. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, యాంటీ థెప్ట్ అలారం, జియోఫెన్సింగ్, రిమోట్ ఇమ్మోబిలైజేషన్ వంటి ఫీచర్లను కలిగి ఉంటాయి.