తమిళ్ స్టార్ హీరో తళపతి విజయ్ ప్రముఖ డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా బాలీవుడ్ హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తుండగా ప్రేమలు మూవీ ఫేమ్ మమితా బైజు మీనన్ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా హీరో విజయ్ మరియు ఆయన ఫ్యాన్స్ కి చాల స్పెషల్. ఎందుకంటే విజయ్ కి ఇదే లాస్ట్ సినిమా కావడం అలాగే ఈ సినిమా తర్వాత విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుడటంతో ప్రజల్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యాలని చూస్తున్నాడు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు మేకర్స్ విజయ్ 69 సినిమా టైటిల్ ని ప్రకటించారు. ఇందులోభాగంగా "జన నాయగన్" అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ విషయానికి సంబందించిన పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్స్ లో విజయ్ స్టేజ్ మీద మాట్లాడుతూ ప్రజలతో కలసి సెల్ఫీ తీసుకుంటూ కనిపించాడు. దీన్నిబట్టి చూస్తే జన నాయగన్ సినిమాని పొలిటికల్ థ్రిల్లర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఐతే మరోవైపు ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయిన భగవంత్ కేసరి రీమేక్ అని కొందరు ప్రచారాలు చేశారు. కానీ ఈ పోస్టర్ కి భగవంత్ కేసరి సినిమా స్టోరీ ఏమాత్రం సంబంధం లేనట్లు తెలుస్తోంది.
ALSO READ | The Smile Man OTT release: నవ్వుతూనే వరుస హత్యలు చేస్తున్న ది స్మైల్ మ్యాన్... చివరికి ఏమైంది..?
ఈ విషయం ఇలా ఉండగా ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాతలు వెంకట్ కె. నారాయణ, జగదీష్ పళనిసామి, లోహిత్ ఎన్. కె తదితరులు కలసి కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నారాయణ్, ప్రియమణి, మోనిషా బ్లెస్సీ, వరలక్ష్మి శరత్‌కుమార్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
అయితే ఈ సినిమా కోసం హీరో విజయ్ దాదాపుగా రూ.280 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఎలక్షన్స్ కంటే ముందుగానే జన నాయగన్ సినిమా ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
We call him #JanaNayagan #ஜனநாயகன் ♥️#Thalapathy69FirstLook#Thalapathy @actorvijay sir #HVinoth @thedeol @prakashraaj @menongautham #Priyamani @itsNarain @hegdepooja @_mamithabaiju @anirudhofficial @Jagadishbliss @LohithNK01 @sathyaDP @ActionAnlarasu @Selva_ArtDir… pic.twitter.com/t16huTvbqc
— KVN Productions (@KvnProductions) January 26, 2025