సినీ రంగంలో ప్రతిభ కనబర్చిన వారికి ప్రధానం చేసే సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డుల వేడుకలు శనివారం(సెప్టెంబర్ 14) రోజున ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా పలు టాలీవుడ్ చిత్రాలు సైమా అవార్డులు దక్కించుకున్నాయి.
అయితే గత ఏడాది నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా చిత్రం ఏకంగా 4 సైమా అవార్డులు గెలుచుకుంది. ఈ చిత్ర డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల,హీరోయిన్ కీర్తి సురేష్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన దీక్షిత్ శెట్టి తదితరులకు సైమా అవార్డులు దక్కాయి. అయితే సైమా అవార్డుని హీరో నాని మరో ప్రముఖ టాలీవుడ్ హీరో అయిన విజయ్ దేవరకొండ చేతుల మీదుగా అందుకున్నాడు.
ALSO READ | 2024 సైమా అవార్డ్స్ సొంతం చేసుకున్న తెలుగు చిత్రాలు ఇవే.
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ గతంలో తామిద్దరూ కలసి ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో నటించిన సమయంలోని కొన్ని మెమొరీస్ ని గుర్తు చేసుకున్నాడు. అలాగే హీరో నానికి సైమా అవార్డు అందించడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. తాను ఇండస్ట్రీలో అందరినీ అన్న అని పిలుస్తుంటానని ఈరోజు నుంచి హీరో నాని ని కూడా అన్న అని పిలుస్తానని తెలిపాడు.
ఈ విషయం ఇలా ఉండగా విజయ్ చివరగా నటించిన లైగర్, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో సక్సస్ కోసం కొంతమేర తీవ్రం శ్రమిస్తున్నాడు.