మెట్ల మీదనుంచి జారిపడ్డ హీరో విజయ్ దేవరకొండ..

మెట్ల మీదనుంచి జారిపడ్డ హీరో విజయ్ దేవరకొండ..

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం "సాహిబా" అనే ప్రైవేట్ ఆల్బమ్ లో నటిస్తున్నాడు. దీంతో ఈ ఆల్బమ్ ప్రమోషన్ కోసమని ముంబై కి వెళ్ళాడు. ఇందులోభాగంగా ఈవెంట్ కి వెళ్ళి వస్తుండగా మెట్ల మీద నుంచి దిగుతూ జారీ కింద పడ్డాడు. దీంతో వెంటనే పక్కనున్నవారు అప్రమత్తమై విజయ్ ని లేపారు. అయితే ఈ ప్రమాదంలో విజయం గాయలేమి కాలేదని,  ప్రస్తుతం విజయ్ బాగానే ఉన్నాడని ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బంధువులు సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.

ALSO READ : ఇండస్ట్రీలో ఎవరూ సపోర్ట్ చెయ్యరు... టాలెంట్ ఉండాలి: నిర్మాత దిల్ రాజు

ఈ విషయం ఇలా ఉండగా గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో ఆమధ్య నటించిన ఫ్యామిలీ స్టార్, ఖుషి, లైగర్ తదితర సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని అలరిచలేక పోయాయి. దీంతో ఈసారి తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కాగా ప్రస్తుతం గౌతమ్ తననూరి డైరెక్ట్ చేస్తున్న VD12 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని టాలీవుడ్ ప్రముఖ హీరో సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.